వచ్చే ఐపీఎల్ కోసం కేకేఆర్ భారీ మార్పులు: హెడ్ కోచ్‌గా బేలిస్, మెక్‌కల్లమ్ సైతం!

హైదరాబాద్: ఇంగ్లాండ్‌కు తొలిసారి ప్రపంచకప్ అందించిన కోచ్ ట్రేవర్ బేలిస్ వచ్చే ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారా? అంటే అవుననే సమాధానం వినవస్తోంది. దీంతో పాటు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ సైతం కేకేఆర్‌తో జత కట్టనున్నాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సహా యజమానిగా ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వార్తలు వస్తున్నాయి. కేకేఆర్ హెడ్ కోచ్‌గా ఉన్న న్యూజిలాండ్ మాజీ క్రికెట్ దిగ్గజం జాక్వస్ కల్లిస్ ఇటీవలే తన పదవికి రాజీనామా చేశాడు.

కేకేఆర్ హెడ్ కోచ్‌గా ట్రేవర్ బేలిస్
దీంతో అతడి స్థానంలో ప్రస్తుతం ఇంగ్లాండ్ కోచ్‌గా ఉన్న ట్రేవర్ బేలిస్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. మరోవైపు బ్యాటింగ్ కోచ్‌గా సైమన్ కటిచ్ స్థానంలో బ్రెండన్ మెక్‌కల్లమ్‌తో భర్తీ చేయనున్నట్లు సమాచారం. వీరిద్దరికీ గతంలోనే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో అనుబంధం ఉంది.

రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా
2012, 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ గంభీర్ నాయకత్వంలో రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచినప్పుడు ట్రేవర్ బేలిస్ హెడ్ కోచ్‌గా ఉన్నారు. ఇక, బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను ఆరంభ సీజన్‌లో కేకేఆర్ వేలంలో సొంతం చేసుకుంది. దీంతో కేకేఆర్ ఆడిన తొలి మ్యాచ్‌లో మెక్‌కల్లమ్ 158 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఐదు సీజన్ల పాటు కేకేఆర్ జట్టుకు
ఆ తర్వాత ఐదు సీజన్ల పాటు కేకేఆర్ జట్టుకే మెక్‌కల్లమ్ ఆడాడు. యాషెస్ సిరిస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ కోచ్‌గా ట్రేవర్ బేలిస్ కొనసాగేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో కేకేర్ యాజమాన్యం ఇప్పటికే ట్రేవర్ బేలిస్‌తో సంప్రదింపులు జరిపినట్లు... ఐపీఎల్ 2020లో ఆ జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు అతడు అంగీకరించినట్లు సమాచారం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications