క్రిస్‌లిన్ అర్ధ శతకం.. సన్‌రైజర్స్ లక్ష్యం 160

హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి.. సన్‌రైజర్స్ ముందు 160 పరుగుల లక్ష్యంను ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. నరైన్ చెలరేగడంతో తొలి మూడు ఓవర్లలో స్కోర్ బోర్దు పరుగులు పెట్టింది.

వరుసగా వికెట్లు:
ధాటిగా ఆడే క్రమంలో సునీల్ నరైన్(25, 8 బంతుల్లో 3x4, 2x6) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మూడు ఓవర్లు పూర్తయ్యేసరికి కోల్‌కతా 44 పరుగులు చేసింది. నరైన్ అవుటయ్యాక స్కోరు ఒక్కసారిగా నెమ్మదించింది. ఆ తర్వాత కాసేపటికే శుభ్‌మన్ గిల్ (3) పెవిలియన్ చేరాడు. సన్‌రైజర్స్ బౌలర్ల దాటికి నితీశ్ రాణా (11), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (6)లు కూడా త్వరత్వరగానే పెవిలియన్ చేరారు.

ఆదుకున్న క్రిస్‌లిన్:
వరుసగా వికెట్లు పడుతున్నా.. మరో ఓపెనర్ క్రిస్‌లిన్ క్రీజులో నిలబడ్డాడు. అయితే కోల్‌కతా స్కోరు బోర్డు మాత్రం ఒక్కసారిగా నెమ్మదించింది. పది ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా 80 పరుగులు చేసింది. ఈ సమయంలో లిన్.. రింకు సింగ్ (30, 25 బంతుల్లో 1x4, 2x6)తో కలిసి ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టాడు. అయితే రింకు సింగ్ భారీ షాట్ ఆడి రషీద్‌ఖాన్ చేతికి చిక్కాడు.

రస్సెల్ విఫలం:
అడపాదడపా బౌండరీలు బాదుతూ క్రిస్‌లిన్ (51, 47 బంతుల్లో 4x4, 1x6) మాత్రం అర్ధ శతకం చేసి అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ చివరలో మెరుపులు మెరిపిస్తాడనుకున్న రస్సెల్.. రెండు సిక్సర్లు బాది పెవిలియన్ చేరాడు. చివరి ఐదు ఓవర్లలో పరుగులు చేయడంలో కోల్‌కతా పూర్తిగా విఫలమైంది. దీంతో 159 పరుగుల సాధారణ స్కోరుకే పరిమితమైంది. హైదరాబాద్ బౌలర్ ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు.. భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీసుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications