కేకేఆర్ రిలీజ్ జేస్తే.. టీమిండియా కెప్టెన్సీ పక్కా!
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి, భారత జాతీయ జట్టు కెప్టెన్సీకి మధ్య ఓ విచిత్రమైన ఇంట్రెస్టింగ్ రిలేషన్ వెలుగులోకి వచ్చింది. కేకేఆర్ జట్టు ఒకప్పుడు తమ జట్టులో భాగమైన ముగ్గురు కీలక ఆటగాళ్లను వదులుకున్న తర్వాత వారు ముగ్గరూ వేర్వేరు సమయాల్లో భారత జట్టుకు కెప్టెన్సీ వహించే స్షాయికి ఎదగడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ జాబితాలో స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ముందున్నాడు. ఒకప్పుడు కేకేఆర్ జట్టులో ఫినిషర్‌గా, వైస్ కెప్టెన్‌గా సేవలందించిన సూర్యకుమార్ యాదవ్ ను కేకేఆర్ జట్టు తదుపరి సీజన్లలో వదులుకుంది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌లో చేరి తన కెరీర్‌ను మలుపు తిప్పుకున్న సూర్యకుమార్, అంతర్జాతీయ వేదికపై 'మిస్టర్ 360'గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కేకేఆర్ నుంచి విడుదలైన తర్వాత సూర్యకుమార్ యాదవ్ తన అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యంతో ఏకంగా భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే స్థాయికి చేరాడు.

ఇక రెండో ఆటగాడు ప్రస్తుత టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్. కేకేఆర్ జట్టు ద్వారానే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చి, ఓపెనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శుభ్‌మన్ గిల్‌ను ఆ ఫ్రాంచైజీ వేలంలోకి వదిలేసింది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్‌గా మారి అద్భుతాలు సృష్టించిన గిల్.. ప్రస్తుతం అత్యంత పిన్న వయసులోనే భారత టెస్ట్ జట్టు సారథ్య బాధ్యతలను అందుకొని రికార్డుల వేట సాగిస్తున్నాడు. కేకేఆర్ వదిలేసిన మరో రత్నంగా గిల్ భారత కెప్టెన్సీ పీఠాన్ని అధిరోహించాడు.
ఇటీవల కాలంలో ఈ విచిత్రమైన సెంటిమెంట్‌లో చేరిన ఆటగాడు శ్రేయస్ అయ్యర్. కేకేఆర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్‌ను కూడా ఆ ఫ్రాంచైజీ వదులుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఫామ్ కోల్పోయిన సూర్యకుమార్ యాదవ్‌ను జట్టు నుంచి తప్పించడంతో తాజాగా ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలకు ప్రకటించిన భారత టీ20 జట్టుకు శ్రేయస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది. ఈ విధంగా కేకేఆర్ విడుదల చేసిన ముగ్గురు ఆటగాళ్లు (సూర్యకుమార్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్) టీమిండియాను ముందుండి నడిపించే కెప్టెన్లుగా మారడం నిజంగా ఒక అరుదైన, ఆశ్చర్యకరమైన విషయమేనని చెప్పాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications