KKR Playing XI vs DC:షకిబ్‌కే ఓటు..రసెల్ డౌట్!వెంకీ చెలరేగితే డబిడదిబిడే!ఢిల్లీతో బరిలోకిదిగే కేకేఆర్ జట్టిదే!

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో నేడు అసలుసిసలైన సమరం జరగనుంది. క్వాలిఫయర్-2లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. లీగ్‌ దశలో అత్యధిక విజయాలతో ప్లే ఆఫ్స్‌ చేరి.. క్వాలిఫయర్‌-1లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ఢిల్లీ తుదిపోరుకు చేరాలని తహతహలాడుతోంది. ఇక నాకౌట్‌ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఇంటి దారి పట్టించిన కోల్‌కతా అదే జోరులో టైటిల్‌ ఫైట్‌కు అర్హత సాధించాలని చూస్తున్నది. ఇప్పటికే చెన్నై ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకోగా.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు శుక్రవారం జరుగనున్న టైటిల్ పోరులో ధోనీసేనతో తలపడనుంది.

 యూఏఈ కలిసొచ్చింది

యూఏఈ కలిసొచ్చింది

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అతికష్టం మీద ప్లే ఆఫ్స్‌ చేరిందని చెప్పాలి. తొలి దశలో మోర్గాన్ సేన ప్రదర్శన చూస్తే.. పట్టికలో చివరి స్థానాల్లో నిలవడం ఖాయం అనిపించింది. తొలి దశలో ఆడిన ఏడు మ్యాచుల్లో కేవలం రెండే విజయాలు అందుకుంది. కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ మ్యాచులు యూఏఈకి మారడం కోల్‌కతాకు కలిసివచ్చింది. ఆడిన ఏడు మ్యాచుల్లో ఏకంగా ఐదింటిలో గెలుపొందింది. దాంతో 14 పాయింట్లు సాధించి నాలుగో స్థానంను కైవసం చేసుకుంది. ముంబై ఇండియన్స్ కూడా 14 పాయింట్లతో ఉన్నా.. నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో మోర్గాన్ సేన ప్లే ఆఫ్స్‌ చేరింది. ఇక తొలి ఐపీఎల్‌ టైటిల్‌ సాధించాలనుకున్న విరాట్‌ కోహ్లీ ఆశలపై నీళ్లు చల్లిన కోల్‌కతా.. ఎలిమినేటర్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును ఓడించి క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది. ఇప్పుడు ఢిల్లీతో అమితుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో కోల్‌కతా ప్లేయింగ్ ఎలెవన్‌ను ఓసారి పరిశీలిద్దాం.

 వెంకీ చెలరేగితే డబిడదిబిడే:

వెంకీ చెలరేగితే డబిడదిబిడే:

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టులో ప్రధానంగా జరిగిన మార్పు ఒకటే. దేశవాళీ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌ను ఓపెనర్‌గా తీసుకురావడం. మొదటి మ్యాచులోనే అతడు చెలరేగాడు. దాంతో వరుస అవకాశాలు దక్కించుకుని జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి వెంకీ అద్భుత ఆరంభాలతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు పార్ట్‌టైం బౌలర్‌గా, ఫీల్డర్‌గానూ జట్టుకు బాగా ఉపయోగపడుతున్నాడు. చాలా మ్యాచ్‌ల్లో గిల్‌, వెంకటేశ్‌లే కోల్‌కతా బ్యాటింగ్‌ భారాన్ని మోశారు. కీలక ఎలిమినేటర్‌లో కూడా ఈ ఇద్దరు సత్తాచాటిన విషయం తెలిసిందే. క్వాలిఫయర్‌-2లో కూడా ఈ జోడీపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా వెంకీపై. అతడు చెలరేగితే ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు డబిడదిబిడే.

రసెల్ డౌటే:

రసెల్ డౌటే:

రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ రాణాలు కూడా కోల్‌కతా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. త్రిపాఠి, రాణాల దూకుడైన బ్యాటింగ్ ప్రత్యర్థికి పెద్ద సవాలే. ఈ ఇద్దరు మ్యాచును ఒంటిచేత్తో గెలిపించగలరు. వీరి నుంచి కూడా మేనేజ్మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఇక సీనియర్లు ఇయాన్ మోర్గాన్‌, దినేశ్‌ కార్తీక్‌ ఇప్పటివరకు తమ సత్తాచాటలేదు. వీళ్ల మెరుపులు కేవలం 1-2 మ్యాచులకే పరిమితం అయ్యాయి. కీలక మ్యాచ్ కాబట్టి వేరు మోర్గాన్‌, కార్తీక్‌ కూడా గాడిలో పడితే.. కోల్‌కతాకు తిరుగుండదు. ఇక స్టార్ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్ ఈ మ్యాచ్ ఆడడం అనుమానమే. గాయం కారణంగా గత మ్యాచుల్లో ఆడిన రసెల్.. ప్రస్తుతం ఫిట్‌నెస్‌ సాదించాడు. అయితే అతడి స్థానంలో ఆడిన షకిబ్‌ ఉల్ హాసన్ సత్తాచాటాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థిని కట్టడిచేశాడు. ఇక షార్జా పిచ్ కూడా స్పిన్నర్లకు అనుకూలించనున్న నేపథ్యంలో క్వాలిఫయర్‌-2లో అతడే ఆడనున్నాడు.

మాయ చేస్తున్న నరైన్‌, వరుణ్‌

మాయ చేస్తున్న నరైన్‌, వరుణ్‌

ఇక బౌలింగ్‌ కూడా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు పెద్ద బలం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌ నిలకడగా రాణిస్తున్నారు. వీరికి షకిబ్‌ ఉల్ హాసన్ కూడా తోడయ్యాడు. నరైన్‌ అప్పుడప్పుడూ బ్యాటుతోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. షకిబ్‌ నాణ్యమైన బ్యాట్స్‌మన్‌ కూడా కావడం కోల్‌కతాకు కలిసొచ్చే అంశం. పేస్‌ విభాగంలో లుకీ ఫెర్గూసన్‌, శివమ్ మావి కూడా రాణిస్తున్నారు. ముఖ్యంగా ఫెర్గూసన్‌ తన పేస్ బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఈ రోజు కూడా బౌలర్లు సమిష్టిగా రాణిస్తే.. కోల్‌కతా విజయం పెద్ద కష్టమేమి కాదు. మొత్తంగా గత కొన్ని మ్యాచ్‌ల నుంచి నిలకడ, దూకుడుతో ఆకట్టుకుంటున్న కోల్‌కతా.. రెండో క్వాలిఫయర్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది.

 కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తుది జట్టు(అంచనా):

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తుది జట్టు(అంచనా):

శుభ్‌మన్‌ గిల్, వెంకటేశ్‌ అయ్యర్‌, రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ రాణా, ఇయాన్ మోర్గాన్‌ (కెప్టెన్‌), దినేశ్‌ కార్తీక్‌ (వికెట్ కీపర్), షకిబ్‌ ఉల్ హాసన్, సునీల్ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి, లుకీ ఫెర్గూసన్‌, శివమ్ మావి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, October 13, 2021, 10:32 [IST]
Other articles published on Oct 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X