DC vs KKR Playing 11:వెంకటేష్ అయ్యర్ ఔట్.. అజింక్యా రహానే ఇన్, నేటి ఢిల్లీ వర్సెస్ కోల్‌కతా మ్యాచ్ తుది జట్లు!

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యచ్ నేడు రాత్రి 7.30కు జరగనుంది. రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్.. గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై చివరి ఓవర్లో వివాదాస్పద నోబాల్‌తో ఓటమిని చవిచూసింది. ప్రస్తుతం ఏడు మ్యాచ్‌లలో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ ఏడో స్థానంలో ఉంది.
మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ గత 4మ్యాచ్‌లలో వరుసగా ఓటమి పాలయింది. దీంతో ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే ఆత్రుతతో ఉంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని కేకేఆర్ టాప్ ఆర్డర్ మంచి ఓపెనింగ్స్ ఇవ్వలేకపోవడం ఆ జట్టుకు నష్టాన్ని చేకూరుస్తోంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో రసెల్ చెలరేగినా.. కేకేఆర్ గెలవలేకపోయింది.

వరుణ్ చక్రవర్తి ఫామ్ అందుకోవాలి
ఈ మ్యాచ్‌లో కేకేఆర్ వెంకటేష్ అయ్యర్‌ను తప్పించి అతని స్థానంలో అజింక్యా రహానేను తీసుకునే అవకాశముంది. వరుస మ్యాచ్‌లలో వెంకటేష్ అయ్యర్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచడం లేదు. దీంతో రహానేను ప్రయత్నించాలని కేకేఆర్ చూస్తోంది.
ఇక సునీల్ నరైన్, శ్రేయస్ అయ్యర్, నితిష్ రాణా, సామ్ బిల్లింగ్స్, రింకూ సింగ్ బ్యాటింగ్ ఆర్డర్లో కొనసాగుతారు. ఆల్ రౌండర్ ఆండ్రూ రసెల్ తన ఫామ్ కొనసాగించాల్సిన అవసరముంది. కేకేఆర్ బౌలింగ్ యూనిట్ బలంగా ఉంది టిమ్ సౌథీ, ఉమేష్ యాదవ్, శివమ్ మావి మంచి స్పెల్స్ వేస్తున్నారు. వరుణ్ చక్రవర్తీ ఫామ్ పుచ్చుకోవాలి.

ఢిల్లీ టీం ఎంపికలో సస్పెన్స్
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన ప్లేయింగ్ 11ను ఎలా బరిలో దించుతుందో సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్న ఆ జట్టు స్టార్లు మిచెల్ మార్ష్, టిమ్ సీఫెర్ట్ ప్రాక్టీసు సెషన్లో జాయిన్ అయ్యారు. కానీ నేటి మ్యాచ్‌కు వారు అందుబాటులో ఉండడం డౌటే. ఒకవేళ ఉంటే గనుక సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో మిచెల్ మార్ష్‌ను దించే వీలుంది. ఎందుకంటే గత మ్యాచ్‌లో ఢిల్లీ ముగ్గురు విదేశీ ప్లేయర్లతోనే బరిలోకి దిగింది.

ఢిల్లీ క్యాపిటల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI అంచనా
ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, (సర్ఫరాజ్ ఖాన్ లేదా మిచెల్ మార్ష్), రిషబ్ పంత్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI: అజింక్యా రహానే, సునీల్ నరైన్, శ్రేయాస్ అయ్యర్ (సి), నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, టిమ్ సౌతీ, శివమ్ మావి, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications