Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR Playing 11 For IPL 2022: స్టార్ ఆల్‌రౌండ‌ర్ల‌తో బ‌రిలోకి.. బౌలింగ్ యూనిట్‌ను న‌డిపించేది అత‌నే!

KKR Playing 11 For IPL 2022: Three star all-rounders enter the ring. Pat Cummins leads the bowling unit.
IPL 2022 : Kolkata Knight Riders Playing XI For IPL 2022 | Oneindia Telugu

కోల్‌క‌తా: ఐపీఎల్ 2022 స‌రిగ్గా మ‌రో వారం రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. దీంతో జ‌ట్ల‌న్నీ ఇప్ప‌టి నుంచే త‌మ ప్లేయింగ్ 11పై క‌స‌ర‌త్తులు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఐపీఎల్‌లో రెండు సార్లు టైటిల్ గెలిచిన కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్ కూడా త‌మ తుది జ‌ట్టుపై తీవ్ర క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఈ సారి కొత్త కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ నాయ‌క‌త్వంలో బ‌రిలోకి దిగ‌నున్న ఆ జ‌ట్టు మూడోసారి టైటిల్‌ను ముద్దాడాల‌ని భావిస్తోంది.

కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్ స్క్వాడ్

కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్ స్క్వాడ్

శ్రేయస్‌ అయ్యర్ (12.25 కోట్లు), ఆండ్రీ రసెల్‌ (12 కోట్లు), వరుణ్‌ చక్రవర్తి (8 కోట్లు), వెంకటేశ్‌ అయ్యర్‌ (8 కోట్లు) నితీశ్‌ రాణా ( 8 కోట్లు), శివమ్‌ మావి (7.25 కోట్లు), ప్యాట్‌ కమిన్స్ (7.25 కోట్లు), ఉమేశ్‌ యాదవ్ (2 కోట్లు), సామ్‌ బిల్లింగ్స్ (2 కోట్లు), అలెక్స్‌ హేల్స్ (1.50 కోట్లు), టిమ్‌ సౌథీ (1.50 కోట్లు), అజింక్య రహానె (కోటి), నబీ (కోటి), షెల్డన్‌ జాక్‌సన్ (60 లక్షలు), రింకు సింగ్ (55 లక్షలు), అశోక్‌ శర్మ ( 55 లక్షలు), చమిక కరుణరత్నె (50 లక్షలు), అభిజిత్‌ తోమర్ (40 లక్షలు), అమన్‌ఖాన్‌, అనుకుల్ రాయ్, ప్రతామ్‌ సింగ్, రసిఖ్ దార్‌, బాబా ఇంద్రజిత్ (వీరంద‌రికీ 20 లక్షలు).

ఓపెన‌ర్లుగా వీళ్లే

ఓపెన‌ర్లుగా వీళ్లే

23 మంది ఆట‌గాళ్లున్న కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్‌లో తుది జ‌ట్టును ఎంపిక చేయ‌డ‌మ‌నేది క‌ష్టంతో కూడిన ప‌ని అనే చెప్పుకోవాలి. ఆ జ‌ట్టు ఓపెన‌ర్లుగా గ‌త సీజ‌న్లో అద‌ర‌గొట్టిన వెంక‌టేశ్ అయ్య‌ర్ ఖాయం కాగా, అత‌నికి తోడుగా షెల్డన్‌ జాక్‌సన్ దిగే అవ‌కాశాలు ఉన్నాయి. అలాగే ఆ జ‌ట్టు ఆల్‌రౌండ‌ర్ సునీల్ న‌రైన్ కూడా ఓపెన‌ర్‌గా రాణించ‌గ‌ల‌డు. గ‌తంలో అనేక సార్లు ఓపెన‌ర్‌గా ఆడిన సునీల్ న‌రైన్‌.. కోల్‌క‌తాను ఒంటి చేత్తో గెలిచిపించిన సంగ‌తి తెలిసిందే.

మిడిలార్డ‌ర్ వారితో భ‌ర్తీ

మిడిలార్డ‌ర్ వారితో భ‌ర్తీ

ఇక కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయ‌నున్నాడు. నాల్గో స్థానంలో నితీష్ రాణా ఆడ‌నున్నాడు. ఇక ఐదో స్థానంలో వికెట్ కీప‌ర్ సామ్‌ బిల్లింగ్స్ బ్యాటింగ్ చేయ‌నున్నాడు. ఆరో స్థానంలో పేస్ ఆల్‌రౌండ‌ర్ ఆండ్రూ ర‌సెల్, ఏడో స్థానంలో స్పిన్ ఆల్‌రౌండ‌ర్ సునీల్ న‌రైన్‌ బ‌రిలోకి దిగ‌నున్నారు. వీరిద్ద‌రే కాకుండా ఓపెన‌ర్ వెంక‌టేష్ అయ్య‌ర్ కూడా పేస్ ఆల్‌రౌండ‌రే అనే సంగ‌తి గ‌మ‌నార్హం. మొత్తంగా కోల్‌క‌తా జ‌ట్టులో ముగ్గురు స్టార్ ఆల్‌రౌండ‌ర్లు క‌నిపిస్తున్నారు. వీరిలో ఇద్ద‌రు స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఆడిన కోల్‌క‌తాను ఆప‌డం చాలా క‌ష్టంతో కూడుకున్న ప‌ని అని క్రికెట్ విశ్లేష‌కులు అభిప్రాయ‌పడుతున్నారు.

బౌల‌ర్లు వీళ్లే

బౌల‌ర్లు వీళ్లే

పేస్ బౌల‌ర్లుగా ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ పాట్ క‌మిన్స్‌, శివ‌మ్ మావి ఆడ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఒక స్పిన్న‌ర్‌గా వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి ఖ‌రారు కాగా, మ‌రో స్పిన్న‌ర్‌గా అనుకుల్ రాయ్ ఆడే అవ‌కాశం ఉంది. మొత్తంగా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు ఈ సారి బ‌లంగా కనిపిస్తోంది. ఆ జ‌ట్టు బౌలింగ్ విభాగాన్ని ఈ సారి కూడా పాట్ క‌మ్మిన్సే ముందుండి న‌డిపించనున్నాడు. కాగా కోల్‌క‌తా త‌మ తొలి మ్యాచ్‌ను ఈ నెల 26న చెన్నైసూప‌ర్ కింగ్స్‌తో ఆడ‌నుంది.

కోల్‌క‌తా నైట్ రైడర్స్ తుది జట్టు (అంచ‌నా)

కోల్‌క‌తా నైట్ రైడర్స్ తుది జట్టు (అంచ‌నా)

జాక్సన్, వెంక‌టేష్ అయ్యర్, శ్రేయ‌స్ అయ్యర్ (కెప్టెన్‌), నితీష్ రానా, సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీప‌ర్‌), ఆండ్రూ ర‌సెల్, సునీల్ న‌రైన్, పాట్ క‌మ్మిన్స్‌, శివ‌మ్ మావి, అంకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి.

Story first published: Friday, March 18, 2022, 10:26 [IST]
Other articles published on Mar 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+