For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాటూలు వేసుకోవడం కాదు ముందు ఫినిషింగ్ చేయ్ అంటూ.. ట్రోలింగ్ గురైన కేకేఆర్ ప్లేయర్ !

KKR player Sheldon Jackson was trolled by netizens because of not hitting a single boundary in death overs

నిన్న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓటమి తర్వాత కోల్‌కతా కీపర్ షెల్డన్ జాక్సన్ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యాడు. 35ఏళ్ల ఈ సౌరాష్ట్ర ప్లేయర్‌ను కొందరు నెటిజన్లు టార్గెట్ చేశారు. కేకేఆర్ ఓటమికి అతనే కారణమంటూ కామెంట్లు చేశారు. విలువైన ఆటగాడు కాదని, అతన్ని కోల్‌కతా కొనడంలో అర్థం లేదని ట్వీట్ చేశారు.

ఒక పక్క బ్యాటర్ అయిన షెల్డన్ జాక్సన్ కంటే.. బౌలర్ అయిన ఉమేష్ యాదవ్ హిట్టింగ్‌పైనే కోల్‌కతా నమ్మకం ఉంచడం నవ్వొస్తుందంటూ కామెంట్లొస్తున్నాయి. ఇంగ్లీష్ ప్లేయర్ పేరు పెట్టుకున్నంత మాత్రాన, టాటూలు వేయించుకున్నంత మాత్రాన గొప్ప ప్లేయర్ అయిపోరని, చివర్లో మ్యాచ్ ఫినిష్ చేసే సామర్థ్యం ఉంటేనే ఆడాలని కొందరు అతన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.

ఈ మ్యాచ్‌లో భాగంగా రాజస్థాన్ విధించిన 218పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేదుకు బరిలోకి దిగిన కోల్‌కతా దీటుగా పోరాడింది. కానీ చాహల్ వేసిన 17ఓవర్లో 4వికెట్లు కోల్పోవడంతో 180పరుగులకే 8వికెట్లు కోల్పోయి కోల్‌కతా కష్టాల్లో పడింది. ఇక చివరి మూడు ఓవర్లలో 38పరుగులు అవసరమైన దశలో క్రీజులో షెల్డన్ జాక్సన్, ఉమేష్ యాదవ్ ఉన్నారు.

18ఓవర్ బౌల్ట్ వేయగా.. ఉమేశ్ యాదవ్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌ కొట్టడంతో మొత్తం ఆ ఓవర్లో 20పరుగులు వచ్చాయి. దీంతో మళ్లీ కోల్‌కతా వైపు మ్యాచ్ టర్న్ అయింది. కానీ.. చివరి రెండు ఓవర్లలో గెలుపు కోసం 18పరుగులు అవసరమైన దశలో క్రీజులో ఉన్న షెల్డన్ జాక్సన్ ఒక్క బౌండరీ కూడా బాదలేకపోయాడు.

స్వతహాగా బ్యాటర్ అయిన జాక్సన్ సింగిల్స్, డబుల్స్ మాత్రమే తీయగలిగాడు. ప్రసీద్ వేసిన 19ఓవర్లో కేవలం 9పరుగులే వచ్చాయి. పోనీ చివరి 20వ ఓవర్లో అయినా బౌండరీ కొట్టి గెలిపిస్తాడనుకుంటే రెండో బంతికి ఔటయ్యాడు. 8బంతుల్లో కేవలం 8పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టాడు. చివరి ఓవర్లో 11 పరుగులు అవసరమైన దశలో రాజస్థాన్ బౌలర్ ఓబెడ్ మెక్ కాయ్ 3పరుగులే ఇచ్చి ఇద్దరిని ఔట్ చేయడంలో కోల్‌కతా 210పరుగులకు ఆలౌటైంది.

7పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. జాక్సన్ ఒక్క బౌండరీ కొట్టినా మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదని కోల్‌కతా అభిమానులు అంటున్నారు. ఏదేమైనా ఈ ఐపీఎల్లో అసలు సిసలు టీ20 మజాను ఈ మ్యాచ్ అందించిందని పలువురు పేర్కొంటున్నారు. ఒక్క మ్యాచ్ ఆధారంగా ఆటగాడిని ఇలా ట్రోల్ చేయడం సరికాదని, బ్యాటర్‌దే ఆధిపత్యం ఉంటుందనే భావన కూడా సరికాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Story first published: Tuesday, April 19, 2022, 14:52 [IST]
Other articles published on Apr 19, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+