Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెన్నై విజయాలకు కోల్‌కతా అడ్డుకట్ట: ధోనీ సేనను ఓడించిన గంభీర్ సేన

Kolkata Knight Riders
కోల్‌కతా: వరుసగా నాలుగు విజయాలతో జోరు మీదున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు గంభీర్ సారథ్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ అడ్డుకట్ట వేసింది. మ్యాచ్‌కి వర్షం అడ్డు రావడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం కోల్‌కతా పది పరుగులతో చెన్నయ్‌పై విజయం సాధించింది. 115 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గంభీర్ సేన పది ఓవర్లలో రెండు వికెట్లకు 61 పరుగులు చేసింది. ఈ సమయంలో ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. అప్పటికే విజయం దిశగా పయనిస్తున్న కోల్‌కతాను విజేతగా ప్రటించారు. కలిస్ 21, మనోజ్ తివారి 15 నాటౌట్‌గా నిలిచారు. గంభీర్ 16 పరుగులు చేశాడు. అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా అంతకుముందు వర్షం రావడంతో మ్యాచ్ గంట ఆలస్యంగా ఆరంభంమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ధోనీసేన నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లకు 114 పరుగులు చేసింది. బద్రీనాథ్ 41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 హాఫ్ సెంచరీకి తోడు అల్బీ మోర్కెల్ 30 రాణించాడు.

అబ్దుల్లా, బ్రెట్ లీ అద్భుతంగా బౌలింగ్ చేశారు. అబ్దుల్లా నాలుగు ఓవర్లకు 15 పరుగులిచ్చి వికెట్ తీయగా, బ్రెట్ లీ నాలుగు ఓవర్లలో ఎనిమిదే పరుగులిచ్చి ఆకట్టుకున్నాడు. అబ్దుల్లాకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. వర్షం అంతరాయం కలిగించడంతో పాటు చెన్నయ్ నింపాదిగా బ్యాటింగ్ చేయడంతో మ్యాచ్ నిరాసక్తతగా చప్పగా ముగిసింది. కోల్‌కతా బౌలర్లు పరిస్థితులను సద్వినియోగం చేసుకుని చెన్నైని కట్టడి చేశారు. ఓపెనింగ్ జోడీ మైక్ హస్సీ, మురళీ విజయ్ మరీ నింపాదిగా ఆడటంతో టి-20 కాస్తా టెస్టు మ్యాచ్‌లా సాగింది. దీంతో ఆరు ఓవర్లలో చెన్నయ్ 15/2తో కష్టాల్లో పడింది. ఆదుకున్న బద్రీ: బంతి బౌండరీ లైన్ దాటడానికి 10వ ఓవర్ వరకు వేచి చూడాల్సి వచ్చింది.

ఎట్టకేలకు యూసుఫ్ బౌలింగ్‌లో బద్రీనాథ్ తొలి సిక్సర్ కొట్టాడు. ఆ మరుసటి ఓవర్లో హస్సీ 15 అవుటయ్యాడు. బద్రీ ఒంటరి పోరాటం చేస్తూ స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు. వీలైనప్పుడల్లా ఫోర్లు బాదుతూ వేగంగా పరుగులు రాబట్టాడు. బద్రీ స్ఫూర్తితో అల్బీ మోర్కెల్ ఉనాడ్కట్ బౌలింగ్‌లో వరసగా రెండు ఫోర్లు కొట్టాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+