For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'టీమిండియాకు కచ్చితంగా ఎంపికవుతా.. కావాలంటే నా రికార్డులను పరిశీలించండి'

KKR opener Nitish Rana hopeful of receiving maiden Team India call up soon
Nitish Rana Hopeful Of Getting Call-Up For IND vs SL Series || Oneindia Telugu

ముంబై: తాను కచ్చితంగా టీమిండియాకు ఎంపికవుతా అని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఓపెనర్ నితీశ్ రాణా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కావాలంటే దేశవాళీ టోర్నీలతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో తన నిలకడైన ఆటతీరును, రికార్డులను పరిశీలించండని కోరాడు. జాతీయ జట్టులో స్థానం దక్కిందని భారత సెలక్షన్ కమిటీ నుంచి వచ్చే పిలుపు కోసం తాను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు నితీశ్ రాణా పేర్కొన్నాడు. గత కొంతకాలంగా ఐపీఎల్ టోర్నీలో కోల్‌కతా తరఫున ఆడుతున్న రాణా.. ఓపెనర్‌గా తన వంతు విజయాలు అందిస్తున్నాడు.

 శ్రీలంకతో భారత్ ఢీ

శ్రీలంకతో భారత్ ఢీ

సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18-22 మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది. ఈ ఫైనల్ పోరులో భారత్, న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. అనంతరం ఇంగ్లండ్‌తో కోహ్లీసేన ఐదు టెస్టులు ఆడనుంది. అయితే విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ వంటి సీనియర్లు లేకుండానే.. జులైలో మరో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో శ్రీలంకతో భారత్ మూడు వన్డేలు, అయిదు టీ20లు ఆడనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవలే ధ్రువీకరించారు. లంక పర్యటనకు తాను ఎంపికవుతానని నితీశ్ రాణా ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

ఆ పిలుపు కోసం ఎదురుచూస్తున్నా

ఆ పిలుపు కోసం ఎదురుచూస్తున్నా

తాజాగా నితీశ్ రాణా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసే జట్టులో నాకు స్థానం దక్కుతుందని నా అంతరాత్మ పదేపదే చెబుతోంది. కాబట్టి ఆ పర్యటనకు సిద్ధంగా ఉన్నా. అవసరమైతే మీరు గత మూడేళ్లలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నా రికార్డులను ఓసారి పరిశీలించండి. అది దేశవాళీ టోర్నీ అయినా.. ఐపీఎల్‌ అయినా నేను మంచి ప్రదర్శన కనబరిచా. దానికి ప్రతిఫలమే త్వరలో దక్కుతుందని భావిస్తున్నా. అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. ఆ పిలుపునకు ఒక్క అడుగు దూరంలో ఉన్నానని అందరూ అంటున్నారు. ఆ పిలుపు కోసం ఎదురుచూస్తున్నా' అని అన్నాడు.

WTC Finals: విలియమ్సన్‌ను త్వరగా ఔట్ చేయాలి.. లేదంటే: ఉమేష్ యాదవ్

7 మ్యాచ్‌లలో 201 పరుగులు

7 మ్యాచ్‌లలో 201 పరుగులు

కొన్నేళ్లుగా కోల్‌కతా బ్యాట్స్‌మన్‌గా చక్కటి ఆటతీరుతో ఆకట్టుకుంటున్న నితీశ్‌ రాణా.. కొత్త సీజన్‌ వస్తోందంటే చెలరేగిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఈసారి ఆడిన తొలి మ్యాచ్‌లోనే సత్తాచాటాడు. ఐపీఎల్ 2021కి ముందు కరోనా బారినప్పటికీ.. మానసిక స్థైర్యంతో దాన్ని జయించి మైదానంలో అడుగుపెట్టి చూడముచ్చటైన బ్యాటింగ్‌తో అలరించాడు.

ఓపెనర్‌గా వచ్చి ఎలాంటి తడబాటు లేకుండా, పూర్తి ఆత్మవిశ్వాసంతో మైదానంలోని అన్ని వైపులా బంతిని బౌండరీలకు తరలించాడు. కవర్‌డ్రైవ్‌లు, కట్‌ షాట్లు, లాఫ్టెడ్‌ షాట్లు ఆడుతూ (80; 56 బంతుల్లో 9x4, 4x6) హాఫ్ సెంచరీ చేశాడు. మొత్తంగా 7 మ్యాచ్‌లలో 201 పరుగులు చేశాడు. 38 ఫస్ట్-క్లాస్ మ్యాచులలో 40 కంటే ఎక్కువ సగటుతో 2266 పరుగులు చేశాడు.

అరుదైన రికార్డు

అరుదైన రికార్డు

ఐపీఎల్ 2021లో నితీష్ రానా ఒక అరుదైన రికార్డును సాధించాడు. ఐపీఎల్‌లో రానా చివరి ఆరు ఇన్నింగ్స్‌లు చూసుకుంటే (చెన్నై మ్యాచ్ వరకు).. వరుసగా 0, 81, 0, 87, 0, 80 పరుగులు చేశాడు. ఇందులో విశేషమేమిటంటే.. సరి, బేసి విధానంలో మూడు సార్లు గోల్డెన్‌ డక్‌, మరో మూడు సార్లు 80కి పైగా పరుగులు సాధించాడు. ఇలా టోర్నీలో ఇప్పటివరకూ ఎవరూ పరుగులు చేయలేదు.

Story first published: Wednesday, May 19, 2021, 13:37 [IST]
Other articles published on May 19, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+