Ashwin: రింకూకు ప్రాక్టీస్ ఛాన్స్ కూడా KKR ఇవ్వలేదు.. బాల్‌బాయ్‌లా చూశారు!
టీమిండియా యువ సంచలనం రింకూ సింగ్‌ను సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కొనియాడాడు.ఎంఎస్ ధోనీ లెఫ్ట్ హ్యాండర్ వెర్షన్‌గా రింకూను అభివర్ణించాడు. అయితే క్రికెట్‌లో దిగ్గజ ధోనీతో రింకూను పోల్చడం సరికాదని, కానీ ప్రశాంతత విషయంలో వారిద్దరిని పోల్చినట్లు వివరించాడు. అలాగే రింకూ గతంలో ఎదుర్కొన్న కష్టకాలాన్ని అశ్విన్ తెలిపాడు.
నయా ఫినిషర్‌గా రింకూ సింగ్ సత్తాచాటుతున్న విషయం తెలిసిందే. దూకుడైన బ్యాటింగ్‌తో పాటు పరిస్థితులకు తగ్గట్టుగా నిలకడగా ఆడతాడని అఫ్గానిస్థాన్ చివరి టీ20లో రింకూ నిరూపించాడు. టీమిండియా 22/4తో కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన రింకూ.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి జట్టు స్కోరును 212/4కు చేర్చాడు. మొదట్లో నిదానంగా ఆడిన రింకూ ఆఖర్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

అయితే టీమిండియా తరపున ఇప్పటివరకు 15 టీ20లు, రెండు వన్డేలు ఆడిన రింకూ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. 2018లో ఐపీఎల్‌లో కేకేఆర్ తరపున తొలి మ్యాచ్ ఆడిన రింకూ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ గత సీజన్‌లో వెలుగులోకి వచ్చాడు. అసాధ్యమైన టార్గెట్‌లను ఛేదించి నయా ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
''ధోనీ లెఫ్ట్ హ్యాండెడ్ వెర్షన్‌గా రింకూ సింగ్‌ని భావిస్తా. ధోనీతో పోల్చట్లేదు. ఎందుకంటే ధోనీ ఓ దిగ్గజం. కానీ అతడి ప్రశాంతత గురించి మాట్లాడుతున్నా. ఉత్తరప్రదేశ్ తరపున నిలకడగా పరుగులు సాధిస్తూ రింకూ భారత జట్టులోకి వచ్చాడు. అయితే కొన్నేళ్ల పాటు అతడు కోల్‌కతా నైట్ రైడర్స్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. కేకేఆర్‌లో అతడికి కనీసం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా రాలేదని కొందరు చెప్పారు. ఇతర బ్యాటర్లు ప్రాక్టీస్ చేసిన బంతుల్ని తీసుకువచ్చి తిరిగి త్రో స్పెషలిస్ట్‌లకు, బౌలర్లుకు అందిచ్చాడని అన్నారు'' అని అశ్విన్ పేర్కొన్నాడు.
కాగా, రింకూ సింగ్ రెడ్ బాల్ క్రికెట్‌లో ఇండియా-ఎ జట్టుకు ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్ లయన్స్‌తో జరగనున్న మూడో టెస్టుకు సెలక్ట్ అయ్యాడు. రింకూతో పాటు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్‌లకు కూడా బీసీసీఐ నుంచి పిలుపు దక్కింది. అహ్మదాబాద్ వేదికగా జనవరి 24 నుంచి రెండో టెస్టు, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications