ఊరుకొనే ప్రసక్తి లేదు.. మోర్గాన్‌, మెక్‌కలమ్‌పై చర్యలు తీసుకుంటాం: వెంకీ

KKR Could Take Action Against Captain Eoin Morgan And Coach Brendon McCullum | Oneindia Telugu

ముంబై: జాతి వివక్ష, జాతి విద్వేషాన్ని ఏమాత్రం సహించే ప్రసక్తే లేదని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ పేర్కొంది. కోల్‌కతా జట్టు ఆటగాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకొనే ప్రసక్తి లేదని వెల్లడించింది. పూర్తి సమాచారం తెలిశాక కోల్‌కతా కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్‌, హెడ్ కోచ్ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ వ్యవహారంపై స్పందిస్తామని తెలిపింది.

ఇంగ్లండ్ క్రికెట్‌లో పాత ట్వీట్ల దుమారం కొనసాగుతోంది. ఆరంగేట్ర పేసర్ ఒలీ రాబిన్‌స‌న్ 8 ఏళ్ల కిందట చేసిన జాతి వివ‌క్ష ట్వీట్లను సీరియస్‌గా తీసుకున్న ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతడిని అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి సస్పెండ్‌ చేసింది. అతని ట్వీట్స్‌పై విచార‌ణ కూడా ప్రారంభించినచింది. ఈ క్రమంలో పలువురు ఇంగ్లండ్‌ క్రికెటర్లు గతంలో చేసిన పాత ట్వీట్లను ఈసీబీ వెలికితీస్తోంది.

ఇండియ‌న్స్‌ను ఎగతాళి చేస్తూ

ఇండియ‌న్స్‌ను ఎగతాళి చేస్తూ

ఒలీ రాబిన్సన్ పాత ట్వీట్‌లపై విచారణ కొనసాగుతుండటం.. మరోవైపు జాత్యాహంకార వ్యాఖ్యల్ని అస్సలు సహించబోమని ఈసీబీ వార్నింగ్ ఇవ్వడంతో మిగిలిన ఇంగ్లండ్ క్రికెటర్లు భయాందోళనలో ఉన్నారు. దీంతో తమ పాత ట్వీట్‌లను తొలగించారు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 'సర్' అనే పదాన్ని వినియోగిస్తూ అప్పట్లో ఇండియ‌న్స్‌ను ఎగతాళి చేస్తూ చేసిన ట్వీట్‌లను తాజాగా డిలీట్ చేశాడు. జోస్ బట్లర్ 'సర్' అంటూ పరోక్షంగా భారతీయులను ఎగతాళి చేస్తూ మూడేళ్ల క్రితం పెట్టిన ట్వీట్‌లను డిలీట్ చేశాడు.

వారిపై తగిన చర్యలు తీసుకుంటాం

వారిపై తగిన చర్యలు తీసుకుంటాం

బ్రెండన్‌ మెక్‌కలమ్‌ కూడా గతంలో ఇలాంటి ట్వీట్లే చేశాడు. దాంతో ఇంగ్లండ్ ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. 'ఆటగాళ్ల విద్వేషపూరితమైన ట్వీట్లపై గతవారం మేం దృష్టి సారించాం. వారు గతంలో పోస్టు చేసిన వివక్షతతో కూడిన సామాజిక మాధ్యమాల పోస్టులపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. మా ఆటలో వివక్షకు తావులేదు. అవసరమైన వారిపై తగిన చర్యలు తీసుకుంటాం. నిజానిజాలు తెలుసుకుని వ్యవహరిస్తాం' అని ఓ ఈసీబీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

విశ్వ‌నాథ‌న్ ఆనంద్‌తో చెస్ ఆడ‌నున్న బాలీవుడ్ స్టార్ హీరో!!

కేకేఆర్‌ జాతి వివక్షను అస్సలు సహించబోదు

కేకేఆర్‌ జాతి వివక్షను అస్సలు సహించబోదు

గతంలో కేకేఆర్‌ ఆటగాళ్లు చేసిన ట్వీట్లపై తమకు పూర్తి సమాచారం తెలియదని ఆ జట్టు సీఈఓ వెంకీ మైసూర్‌ అన్నారు. 'ఈ వ్యవహారంపై మాకింకా పూర్తి వివరాలు అందలేదు. ఏం జరిగిందో తెలియకుండా స్పందించడం సరికాదు. నిజానిజాలు తెలిసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం. ఏదేమైనా కేకేఆర్‌ జాతి వివక్షను అస్సలు సహించబోదని స్పష్టం చేస్తున్నా. వివక్షతతో కూడిన వ్యాఖ్యలు చేసుంటే చర్యలు తీసుకుంటాం' అని వెంకీ తెలిపారు.

స్క్రీన్ షాట్ వైరల్

స్క్రీన్ షాట్ వైరల్

ఐపీఎల్‌లో కోల్‌క‌తా కెప్టెన్‌గా ఉన్న ఇయాన్ మోర్గాన్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వికెట్ కీప‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ గ‌తంలో ఇండియ‌న్స్‌ను వెక్కిరిస్తూ పలు ట్వీట్ల‌ను తొల‌గించినా.. వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్ బ‌య‌ట‌కు వచ్చాయి. 2018 ఐపీఎల్ సంద‌ర్భంగా వీళ్లు ఈ ట్వీట్లు చేశారని సమాచారం. విచార‌ణ పూర్త‌యిన త‌ర్వాత ఈ ఇద్ద‌రిపై చ‌ర్య‌లు తీసుకోవాలో వ‌ద్దో నిర్ణ‌యిస్తామ‌ని ఈసీబీ చెప్పిన‌ట్లు ఓ జాతీయ మీడియా వెల్ల‌డించింది. జేమ్స్ అండ‌ర్స‌న్‌పైనా విచార‌ణ జ‌రిగే అవ‌కాశం ఉంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, June 10, 2021, 14:37 [IST]
Other articles published on Jun 10, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X