Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వాళ్లు నాపై కుట్ర చేస్తున్నారు.. నా సక్సెస్ చూసి కుళ్లుకుంటున్నారు: రహానే

ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ పరాజయంతో పాటు కెప్టెన్ అజింక్య రహానే స్లో బ్యాటింగ్ (10 బంతుల్లో 8 పరుగులు)పై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన అజింక్య రహానే తన విమర్శకులను ఏకిపారేశాడు. తనపై కావాలనే ఓ ఎజెండాతో కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను సాధించిన విజయాలు, క్రికెట్లో సాధించిన గుర్తింపును చూసి కొందరు అసూయ పడుతున్నారని.. అందుకే చిన్న చిన్న వైఫల్యాలను కూడా పెద్దవి చేసి చూపిస్తున్నారని రహానే మండిపడ్డాడు. తాను క్రీజులో ఉండటం ఇష్టం లేని వారే ఇటువంటి విమర్శలకు దిగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.

స్ట్రైక్ రేట్ వివాదం.. గణాంకాలతో జవాబు
అజింక్య రహానే తన స్లో బ్యాటింగ్ గురించి విమర్శలను తోసిపుచ్చాడు. 2023 సీజన్ నుంచి టీ20ల్లో తన స్ట్రైక్ రేట్ మునుపటి కంటే చాలా మెరుగుపడిందని, అత్యుత్తమంగా ఉందని రహానే గుర్తు చేశాడు. విమర్శలు చేసేవారు బహుశా తన గణాంకాలను సరిగ్గా చూడటం లేదని లేదా కావాలనే కళ్లు మూసుకుటున్నారని ఎద్దేవా చేశాడు. పవర్ ప్లేలో భారతీయ బ్యాటర్లలో అభిషేక్ శర్మ తర్వాత అత్యధిక స్ట్రైక్ రేట్ తనకే ఉందని.. ఇది తన ఆటలో వచ్చిన సానుకూల మార్పుకు నిదర్శనమని రహానే స్పష్టం చేశాడు.

KKR Captain Ajinkya Rahane Hits Back at Strike Rate Critics Says They are Jealous of My Success

గేమ్ సెన్స్‌పై రహానే చురకలు
ఒక బ్యాటర్‌‌గా ప్రతి మ్యాచ్‌లోనూ ఒకే విధమైన వేగంతో ఆడటం సాధ్యం కాదని అజింక్య రహానే అభిప్రాయపడ్డాడు. కొన్ని సార్లు పిచ్ పరిస్థితులు లేదా బౌలర్ల వ్యూహాల నేపథ్యంలో బ్యాటింగ్‌లో ఫ్లో దొరకదని.. ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లో అదే జరిగిందని వివరించాడు. తన గురించి మాట్లాడే వారికి కనీస గేమ్ సెన్స్ ఉందో లేదో అని రహానే ప్రశ్నించాడు. రహానే తన సంప్రదాయక ఆటను వదిలి ఇంతలా మెరుగుపడతాడని విమర్శకులు ఊహించలేదని.. అందుకే ఇప్పుడు ఏ చిన్న అవకాశం దొరికినా విమర్శించడానికి సిద్ధమవుతున్నారని అజింక్య రహానే చురకలు అంటించాడు.

ఇతరుల మాటలు నాకు అనవసరం
తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్లను తాను పట్టించుకోనని అజింక్య రహానే తేల్చి చెప్పాడు. "ప్రజలు నా గురించి పాజిటివ్‌గా మాట్లాడుకున్నా, నెగిటివ్‌గా మాట్లాడుకున్నా నాకు సంతోషమే.. కనీసం నా గురించి చర్చిస్తున్నారు కదా" అని రహానే పేర్కొన్నాడు. స్టేడియం బయట జరిగే ప్రచారాల కంటే, తన స్వయంకృషిపైనే తనకు నమ్మకం ఎక్కువని రహానే స్పష్టం చేశాడు. గత పదేళ్లుగా క్రికెట్ ఆడుతున్న తనకు ఏం చేయాలో, ఎలా ఆడాలో బాగా తెలుసని, విమర్శకుల సూచనలు తనకు అవసరం లేదని రహానే తెగేసి చెప్పాడు.

కెప్టెన్‌గా పెరుగుతున్న ఒత్తిడి
ముంబై ఇండియన్స్‌పై 40 బంతుల్లో 67 పరుగులు చేసి అదరగొట్టిన అజింక్య రహానే.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమవ్వడం కేకేఆర్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. పవర్ ప్లే తర్వాత అజింక్య రహానే స్ట్రైక్ రేట్ ఒక్కసారిగా పడిపోవడం జట్టుకు సమస్యగా మారుతోంది. 227 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కెప్టెన్ ఆరంభంలోనే తడబడటం జట్టు ఓటమికి ఓ ప్రధాన కారణమైంది. వరుస ఓటములతో సతమతమవుతున్న కేకేఆర్.. తన కెప్టెన్ నుంచి కేవలం మాటలే కాకుండా మైదానంలో మెరుపు ఇన్నింగ్స్‌లను కూడా ఆశిస్తోంది.

Story first published: Friday, April 3, 2026, 17:20 [IST]
Other articles published on Apr 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+