న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నైట్ క్లబ్'‌లో గంగూలీ: కోల్‌కతా కెప్టెన్ ఎవరో ఆదివారం చెప్తాడు

లో

KKR captain 2018: Sourav Ganguly to talk Chris Lynn injury, potential candidates on TV show

హైదరాబాద్: ఐపీఎల్ ఆరంభం కాకుండానే కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జట్టు నాయకుడి బాధ్యతలు అప్పజెప్పాలని భావించిన క్రిస్ లిన్ భుజానికి గాయంతో లీగ్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు తగ్గాయి. గతేడాది జరిగిన ఐపీఎల్ సీజన్ వరకు నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్‌గా గౌతం గంభీర్‌ వ్యవహరించాడు. అతనిని వేలంలో కొనుగోలు చేయకపోవడంతో కొత్త కెప్టెన్ గురించి క్రిస్ లిన్ ను పరిగణనలోకి తీసుకుందామని జట్టు పరిశీలించింది.

27ఏళ్ల ఆస్ట్రేలియన్ క్రికెటర్ క్రిస్ లిన్‌ను బెంగుళూరు వేదికగా జనవరి 27, 28తేదీల్లో జరిగిన వేలంలో జట్టు కొనుగోలు చేసింది. రూ. 9.6కోట్లకు కోల్‌కత్తా జట్టుకు దక్కిన క్రిస్ లిన్‌ సైతం జట్టుకు నాయకుడిగా ఉండటం తనకు అంగీకారమేనంటూ పేర్కొన్నాడు. అయితే ఈ గాయం కారణంగా గురువారం ఫిబ్రవరి 22వ తేదీ మొదలుకాబోతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో పాల్గొనలేకపోతున్నాడు. మరి ఐపీఎల్ సీజన్ కు అందుబాటులో ఉంటాడా అనేది అనుమానస్పదంగానే ఉంది.

ఇదే విషయంపై గురువారం సాయంత్రం టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ ఓ టీవీ షో ద్వారా వివరణ ఇవ్వనున్నారు. కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు తొలి మూడు సీజన్లకు తానూ ఓ భాగమైన గంగూలీ ఇంటర్వూ ద్వారా అభిమానులతో ముచ్చటించనున్నారు. స్టార్ స్పోర్ట్స్‌లో ఈ షో ఫిబ్రవరి 25వ తేదీన ప్రసారం కానున్నది.

ఆ టీవీ ఛానెల్ ప్రమోలో మాట్లాడిన గంగూలీ ఇలా పేర్కొన్నారు. 'నేను కోల్‌కత్తాలోనే ఉంటాను. కోల్‌కత్తాలో ఏం జరుగుతుందో తెలుసుకుంటాను. ఈ టీవీ షో ద్వారా నైట్ రైడర్స్ జట్టుకు నాయకుడిగా ఎవరుండబోతున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తాను. ఇదే టీవీ చానెల్ బీసీసీఐ నుంచి ఐపీఎల్ ప్రసార హక్కులను నాలుగు సంవత్సరాల వరకు కొనుగోలు చేసింది. ఆ టీవీ షో పేరు 'నైట్ క్లబ్'(knight club). ఈ షో ఆదివారం రాత్రి 10 గంటలకు స్టార్ స్పోర్ట్స్ హిందీ 1/HDలో ప్రసారం కానుంది.

Story first published: Thursday, February 22, 2018, 16:02 [IST]
Other articles published on Feb 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X