For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: టీమిండియా స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీపై క‌ర్చీఫ్ వేసిన ఆ 3 జ‌ట్లు! ధ‌ర ఎంతంటే..

KKR and PBKS and SRH teams compete for Mohammed Shami in IPL mega auction

బెంగ‌ళూరు వేదిక‌గా ఐపీఎల్ మెగా వేలానికి స‌ర్వం సిద్ధ‌మైంది. ఈ నెల 12, 13వ తేదీల‌లో ఆట‌గాళ్ల‌ను కొనుక్కోవ‌డమే మిగిలి ఉంది. దీంతో ఎక్కువ జ‌ట్లు పలువురు స్టార్ ప్లేయ‌ర్ల‌పై క‌న్నేసిన‌ట్టు తెలుస్తోంది. అందులో టీమిండియా స్టార్ మ‌హ్మ‌ద్ ష‌మీని ప్ర‌ధానంగా 3 జ‌ట్లు టార్గెట్ చేశాయ‌ని స‌మాచారం. ఇందుకోసం వేలంలో ష‌మీకి భారీ ధ‌ర చెల్లించేందుకు ఆ జ‌ట్లు సిద్ధంగా ఉన్నాయ‌ట‌.

క‌ర్ఛీఫ్ వేసిన మూడు జ‌ట్లు ఇవే

క‌ర్ఛీఫ్ వేసిన మూడు జ‌ట్లు ఇవే

టీమిండియా స్టార్ పేస‌ర్ మహ్మ‌ద్ ష‌మీపై కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌, పంజాబ్ కింగ్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ క‌ర్చీఫ్ వేశాయ‌ని స‌మాచారం. ష‌మీని ఎలాగైనా వేలంలో కొనుగోలు చేయాల‌ని ఈ మూడు జ‌ట్లు భావిస్తున్నాయ‌ని తెలుస్తోంది. ష‌మీకి ఐపీఎల్‌లో మంచి అనుభ‌వం ఉంది. అలాగే జ‌ట్టులో బౌలింగ్ డిపార్టుమెంట్‌ను కూడా ష‌మీ లీడ్ చేయ‌గ‌ల‌డు. ఇంత స‌త్తా ఉన్న ష‌మీని వ‌దులుకునేందుకు కోల్‌క‌తా, పంజాబ్, స‌న్‌రైజ‌ర్స్ సిద్ధంగా లేవ‌ని చెప్పుకుంటున్నారు.

 ష‌మీ ఎందుకంటే

ష‌మీ ఎందుకంటే

2011 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్న ష‌మీ నిల‌క‌డ‌గా రాణిస్తున్నాడు. గ‌త సీజ‌న్లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించి కూడా రాణించాడు. అయితే ఈ సారి పంజాబ్ రిటెన్ష‌న్ జాబితాలో ష‌మీకి చోటు ద‌క్క‌లేదు. అయితే ష‌మీని మ‌ళ్లీ వేలంలో కొనుగోలు చేయాల‌ని పంజాబ్ భావిస్తోంద‌ట‌. ఇక స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ విష‌యానికొస్తే ఎప్పుడూ బౌలింగ్‌లో పటిష్టంగా ఉండే ఆ జ‌ట్టుకు ఈ సారి రిటెన్ష‌న్ జాబితాలో స‌రైన బౌల‌ర్ లేడు. దీనికి తోడు గ‌తంలో స‌న్‌రైజ‌ర్స్‌లో నిల‌క‌డ‌గా రాణించిన‌ భువ‌నేశ్వ‌ర్‌, ర‌షీద్ ఖాన్‌ను ఆ జట్టు వ‌దిలేసింది. అందుకే ష‌మీ అయితే వారి స్థానాన్ని భ‌ర్తీ చేయ‌గ‌లుగుతాడ‌ని స‌న్‌రైజ‌ర్స్ భావిస్తోంద‌ట‌. అందుకే కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యించంద‌ట‌. ఇక కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ కూడా ష‌మీని కొనుగోలు చేసే ఆలోచ‌న‌లో ఉంది. గ‌త ఏడాది ఆ జ‌ట్టులో ఉన్న పేస‌ర్లు పాట్ కమ్మిన్స్, కమలేష్ నాగర్‌కోటి, శివమ్ మావి, ప్రసిద్ధ్ కృష్ణ, న్యూజిలాండ్ స్పీడ్‌స్టర్ లాకీ ఫెర్గూసన్‌ల ఈ సారి రిటైన్ చేసుకోలేదు. అందుకే ష‌మీని కొనుగోలు చేయాల‌ని చూస్తుందుట‌.

షమీ ఆడిన జ‌ట్లు

షమీ ఆడిన జ‌ట్లు

ఐపీఎల్‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ ఇప్ప‌టివ‌ర‌కు 3 జ‌ట్ల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. 2011 నుంచి 2013 వ‌ర‌కు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు, 2014 నుంచి 2018 వరకు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు, 2019 నుంచి 2021 వరకు పంజాబ్ కింగ్స్ త‌ర‌ఫున ఆడాడు. ఈ క్ర‌మంలో ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 77 మ్యాచ్‌లు ఆడి 79 వికెట్లు తీశాడు. అత్యుత్త‌మ గ‌ణాంకాలు 3/15 గా ఉన్నాయి.

Mohammed Shami Savage All The Way In Tests - Gautam Gambhir | Oneindia Telugu
ధ‌ర ఎంతంటే..

ధ‌ర ఎంతంటే..

ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో మ‌హ్మ‌ద్ ష‌మీ 2 కోట్ల రూపాయ‌ల బేస్ ప్రైజ్‌తో ఉన్నాడు. ప్ర‌స్తుతం ష‌మీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవ‌ల ముగిసిన సౌతాఫ్రికా టూర్‌లోనూ అద‌ర‌గొట్టాడు. దీంతో ఐపీఎల్‌లోనూ రాణిస్తాడ‌ని కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌, పంజాబ్ కింగ్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు న‌మ్ముతున్నాయి. దీంతో మెగా వేలంలో ష‌మీకి 10 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు పెట్టడానికి ఈ 3 జ‌ట్లు వెనుకాడ‌డం లేద‌ని స‌మాచారం.

Story first published: Tuesday, February 8, 2022, 17:03 [IST]
Other articles published on Feb 8, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+