Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsNZ: కేన్ మామ లేకపోవడంతో చేజేతులారా ఓడిన కివీస్.. ఆ రెండు తప్పులు చెయ్యకపోతే..

Kiwis made two grave mistakes which led india to win the third INDvsNZ t20 match

న్యూజిల్యాండ్, భారత్ మధ్య జరిగిన మూడో టీ20 డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్ మధ్యలోనే ఈ మ్యాచ్ రద్దయింది. ఈ క్రమంలో డక్ వర్ల్ లూయిస్ విధానంలో టీమిండియా లక్ష్యాన్ని 9 ఓవర్లకు 75గా కుదించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి టీమిండియా స్కోరు 75/4. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే అంతకుముందు బేఓవల్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ కారణంగా 1-0 తేడాతో సిరీస్ భారత్ వశమైంది.

ఆ ఒక్క పరుగే కారణమా?

ఆ ఒక్క పరుగే కారణమా?

మూడో టీ20లో కివీస్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ చేసిన ఒక చిన్న పొరపాటు వల్లనే ఆ జట్టు ఓడింది. లేదంటే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌దే పైచేయి అయ్యేది. ఛేజింగ్‌లో దారుణంగా తడబడిన టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో 9వ ఓవర్లో దీపక్ హుడా (9 నాటౌట్), హార్దిక్ పాండ్య (30 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. మ్యాచ్ ఆగడానికి ముందు చివరి బంతిని ఐష్ సోధి వేశాడు.

దాన్ని దీపక్ హుడా బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న శాంట్నర్ దాన్ని సరిగ్గా ఆపలేకపోయాడు. దీంతో భారత జట్లు 75/4 స్కోరుతో ఇన్నింగ్స్ ముగించింది. డక్ వర్త్ లూయిస్ విధానంలో టీమిండియా లక్ష్యం కూడా అదే కావడంతో మ్యాచ్ డ్రా అయింది.

శాంట్నర్ ఏమన్నాడంటే?

శాంట్నర్ ఏమన్నాడంటే?

మ్యాచ్ రద్దయిందని అంపైర్లు ప్రకటించిన తర్వాత ఇదే విషయంపై శాంట్నర్ మాట్లాడాడు. తన తప్పిదం వల్ల టీమిండియా చేసిన ఒక్క పరుగే మ్యాచ్‌ ఫలితాన్ని మార్చేయవచ్చని అన్నాడు. అతను అన్నట్లే ఆ ఒక్క పరుగే ఫలితాన్ని మార్చింది. ఆ పరుగు రాకుంటే టీమిండియా 74/4 స్కోరుతోనే ఉండేది. అప్పుడు కివీస్ విజయం సాధించి సిరీస్‌ను కూడా 1-1తో సమం చేసి ఉండేది. కానీ అలా జరగలేదు. దీంతో టీమిండియా ఈ సిరీస్‌ను కూడా తన ఖాతాలో వేసుకుంది.

 ఆ అవుట్ కూడా..

ఆ అవుట్ కూడా..

శాంట్నర్ తప్పు చేయడానికి ముందు కివీస్ జట్టు మొత్తం కూడా ఒక పెద్ద తప్పు చేసింది. లోకీ ఫెర్గూసన్ వేసిన ఓవర్లో పాండ్యా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఫెర్గూసన్ డెలివరీని ఆఫ్‌సైడ్ ఆడేందుకు పాండ్య ప్రయత్నించాడు. అయితే అతను మిస్ అవడంతో బంతిని వికెట్ కీపర్ క్యారీ చేశాడు. తను విసిరిన బంతి పాండ్య బ్యాటును తాకిందని బలంగా నమ్మిన ఫెర్గూసన్ అవుట్ కోసం అప్పీల్ చేశాడు.

కానీ అతనికి సహచర ఆటగాళ్లు ఎవరూ జత కలవలేదు. తీరా రిప్లేలో చూస్తే.. పాండ్య బ్యాటును బంతి తాకినట్లు స్పష్టమైంది. ఆ అవుట్‌ను కివీస్ జట్టు అప్పీల్ చేసి ఉంటే.. పాండ్య కచ్చితంగా పెవిలియన్ చేరే వాడు.

అప్పుడు టీమిండియా టార్గెట్ కూడా పెరిగి ఉండేది. ఈ కారణంగా కివీస్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించేది. రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఉంటే సరైన నిర్ణయం తీసుకునేదేమో కానీ.. తాత్కాలిక సారధి టిమ్ సౌథీ ఈ విషయంలో డేర్ చెయ్యలేకపోయాడు. ఫలితంగా ఓటమిపాలైంది.

Story first published: Wednesday, November 23, 2022, 12:45 [IST]
Other articles published on Nov 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+