For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యూసుఫ్ పఠాన్‌కు గ్యారీ కిర్‌స్టన్ స్పెషల్ బ్యాటింగ్ టిప్స్

By Pratap
Yusuf Pathan
బెంగళూరు: ప్రపంచ కప్‌లో భారత్‌ను విజయపథంలో నడిపించడానికి వ్యూహాలు రూపొందిస్తున్న కోచ్ కిర్‌స్టెన్ కీలక ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాడు. ఇక్కడి జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహిస్తున్న ప్రపంచ కప్ సన్నాహక శిబిరంలో తొలిరోజు ఓపెనింగ్ జోడీ సెహ్వాగ్, గంభీర్‌కు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన గ్యారీ, రెండో రోజు గురువారం ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్, పేసర్ ఆశిష్ నెహ్రాలకు ఎక్కువ సమయం కేటాయించాడు. భారత కోచ్‌గా తనకు ప్రపంచకప్పే చివరి ఈవెంట్ కావడంతో విజయంతో వీడ్కోలు తీసుకోవాలని భావిస్తున్న కిర్‌స్టెన్ ఆటగాళ్లతో కఠోరసాధన చేయిస్తున్నాడు.

షార్ట్‌పిచ్ బంతుల్ని సమర్థంగా ఎదుర్కోవడానికి పఠాన్‌కు కిర్‌స్టన్ సలహాలు ఇచ్చాడు. అంతేగాక, పఠాన్‌కు కొన్ని బౌన్సీ బంతులు విసిరి శిక్షణ ఇచ్చాడు. మూడు గంటల పాటు సాగిన ప్రాక్టీస్‌లో ఇతర బ్యాట్స్‌మెన్‌తో పాటు నెహ్రాకు కూడా బౌలింగ్ చేసి ఆశ్చర్యపరిచాడు. తొలిరోజు కంటే రెండో రోజు టీమిండియా ప్రాక్టీస్ సీరియస్‌గా సాగింది. దక్షిణాఫ్రికా పర్యటనలో గాయాలబారినపడ్డ బ్యాటింగ్ త్రయం సచిన్, సెహ్వాగ్, గంభీర్ 40 నిమిషాల పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు.

క్రీడారంగంలో బ్యాటింగ్ దిగ్గజం సచినే గొప్ప రోల్ మోడలని భారత కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ ప్రశంసించాడు. తాను కలిసిన క్రీడాకారుల్లో మాస్టర్ గొప్ప వ్యక్తని చెప్పాడు. టీమిండియాతో పనిచేయడం ఓ మధురానుభూతని అన్నాడు. భారత్ కోచ్‌గా తనకు అవకాశం వచ్చినపుడు మొదట్లో కాస్త ఆందోళన చెందానని వెల్లడించాడు. గురువారం ఇక్కడ జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో గ్యారీ మాట్లాడుతూ - క్రికెట్‌పై సచిన్‌కున్న అంకితభావమే అతణ్ని చాంపియన్‌ను చేసిందన్నాడు. ఈ కార్యక్రమంలో గ్యారీతో పాటు ధోనీ, యువరాజ్, యూసుఫ్, మాజీ కెప్టెన్లు ద్రావిడ్, కుంబ్లే పాల్గొన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+