Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పెద్ద తేడా ఉండదు: గ్యారీ కిర్సస్టన్

ముంబయి: శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టుకు తాను లేకపోవడం వల్ల పెద్ద తేడా ఏమీ పడదని భారత క్రికెట్ జట్టు కోచ్ గ్యారీ కిర్సస్టన్ అన్నారు. కెప్టెన్ అనిల్ కుంబ్లే జట్టు సభ్యులు దాన్ని పూడ్చుకోగలరని ఆయన అన్నారు. తాము బాగా ఆడాల్సి ఉందనే విషయం వారికి తెలుసునని, బాగానే సిద్ధమవుతున్నారని ఆయన అన్నారు. పరిస్థితిని అంచనా వేసుకోవడం అవసరమని, తాము గెలిచే అవకాశం ఉందని వారికి తెలుసునని ఆయన అన్నారు.

జబ్బు పడిన తల్లిని చూడడానికి ఆయన మంగళవారం రాత్రి దక్షిణాఫ్రికాకు బయలుదేరి వెళ్లారు. దానికి ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము పూర్తిగా దృష్టి పెట్టకపోతే జట్టు ఆటతీరు దెబ్బ తింటుందనే విషయం ప్రతి ఆటగాడికి తెలుసునని ఆయన అ్నారు. అనిల్ కుంబ్లేపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన చెప్పారు. గాలెలో భారత జట్టు ఆటతీరుపై సంతోషంగా ఉందని ఆయన అన్నారు. వచ్చే టెస్టు మ్యాచ్ లో ఏం చేయాలనేది వారు తెలుసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కుంబ్లే నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు.

Story first published: Wednesday, August 6, 2008, 13:59 [IST]
Other articles published on Aug 6, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+