Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్థాన్‌తో అతన్ని ఆడించాల్సిందన్న కిరణ్ మోరే.. హసరంగను కోహ్లీ ఈజీగా ఎదుర్కొంటాడు

Kiran More says Ashwin should have played against Pakistan, and Kohlli will easily face Hasaranga

రవిచంద్రన్ అశ్విన్ ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాల్సిందని భారత మాజీ వికెట్ కీపర్, సెలెక్టర్ కిరణ్ మోరే అభిప్రాయపడ్డాడు. 181పరుగులను భారత బౌలర్లు ఈ మ్యాచ్‌లో డిఫెండ్ చేయలేకపోయిన సంగతి తెలిసిందే. హార్దిక్ పాండ్యా, చాహల్, భువీ ఎక్కువ పరుగులు ఇవ్వడంతో.. ఈ మ్యాచ్ భారత్ నుంచి చేజారింది. అశ్విన్ బ్యాటింగ్ సామర్థ్యం, అతని ఆఫ్ స్పిన్ గురించి కిరణ్ మోరే మాట్లాడాడు. అలాగే దీపక్ హుడాకు ఒక్క ఓవర్ కూడా ఇవ్వకపోవడాన్ని కిరణ్ మోరే ఖంగుతిన్నాడు. స్పోర్ట్స్‌కీడాతో ప్రత్యేక చాట్‌లో మోరే తన అభిప్రాయాలు వెల్లడించాడు.

'నేను భువీ, హార్దిక్, అర్ష్‌దీప్‌లలో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో పాటు అశ్విన్, అక్షర్, రిషబ్‌ పంత్‌లను తుది జట్టులో ఆడించాలని చూస్తాను. అశ్విన్ బ్యాటింగ్ డెప్త్ ఇవ్వడంతో పాటు ప్రపంచస్థాయి ఆఫ్ స్పిన్నర్ కూడా. పాకిస్థాన్‌ మ్యాచ్‌లో అతన్ని తీసుకోవాల్సింది. మంచి ప్రభావం చూపేవాడు. అక్షర్ కూడా మంచి బ్యాటింగ్ డెప్త్ ఇవ్వగలడు. హుడాను ఆడించినప్పుడు మీరు అతనితో బౌలింగ్ చేయించి ఉండాల్సింది. ఎందుకంటే అతను బౌలింగ్‌లో కొద్దో గొప్పో రాణించేవాడు.' అని మోరే చెప్పాడు.

ఇక నేడు జరగబోయే మ్యాచ్‌ గురించి మాట్లాడుతూ.. వనిందు హసరంగాను కోహ్లీ చాలా తేలికగా ఎదుర్కొంటాడని మోరే చెప్పాడు. ఐపీఎల్‌లో ఇద్దరు ఆటగాళ్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కలిసి ఆడినందున.. కోహ్లికి హసరంగా నుంచి పెద్ద ఎఫెక్ట్ ఏమీ ఉండదని మోరే తెలిపాడు.

ఇక నేడు రాత్రి 7.30కు శ్రీలంక వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ ఇండియాకు చాలా కీలకం. ఈ మ్యాచ్ గెలిస్తేనే ఫైనల్ చేరే అవకాశముంటుంది. లేకపోతే ఇండియా ఇంటి బాట పట్టాల్సిందే. అందువల్ల ఈ మ్యాచ్ విషయంలో భారత ప్లేయర్లు చెలరేగాల్సిన అసవరముంది. ఇక వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన లంక మంచి ఊపుమీదుంది.

Story first published: Tuesday, September 6, 2022, 16:28 [IST]
Other articles published on Sep 6, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+