Kiran More: ఇంతకుముందు హార్దిక్ పాండ్యా 3D ప్లేయర్.. ఇప్పుడు 4D ప్లేయర్ అయ్యాడు ఎందుకంటే?

ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్‌ను గుజరాత్ టైటాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ 7వికెట్ల తేడాతో గెలుపొంది అరంగేట్రం చేసిన తొలి సీజన్లోనే టైటిల్ ముద్దాడిన జట్టుగా నిలిచింది. ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ను నిర్ణీత 20ఓవర్లలో 130పరుగులకు గుజరాత్ కట్టడి చేసింది. ఛేదనలో గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133పరుగులు చేసి గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో (30 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34), బౌలింగ్లో 3/17 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా రాణించడంతో గుజరాత్ విజయదుందుభీ మోగించింది. ఇక అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి కెప్టెన్‌గా, ప్లేయర్‌గా హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించారు. ఇక పాండ్యాను మాజీ క్రికెటర్ కిరణ్ మోరే ప్రశంసించాడు. అతనో ఫోర్ డైమెన్షనల్ ప్లేయర్ అంటూ కితాబిచ్చాడు.

హార్దిక్ పాండ్యా ఆకట్టుకునే కెప్టెన్సీ
జట్టు ఇంత సమిష్టిగా రాణించడానికి ప్రధాన కారణం కెప్టెన్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ. అతను చాలా సందర్భాల్లో చెప్పిందేంటంటే.. జట్టులోని ప్రతి ప్లేయర్ కెప్టెన్‌లాగా ఫీలవ్వాలని చూస్తానని, తాను మిగతావాళ్ల కంటే ఏమాత్రం ఎక్కువ కాదని పేర్కొన్నాడు. అందువల్లే ఆ జట్టు ప్లేయర్లు తమ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఒకప్పుడు అగ్రెస్సివ్ బ్యాటర్ అయిన హార్దిక్.. పరిస్థితులను అవగాహన చేసుకుంటూ ఆడుతూ తనలోని అత్యుత్తమ ఆటను బయటకు తీశాడు. కెప్టెన్సీ భారం వల్ల చాలా మంది ప్లేయర్లు తమ వ్యక్తిగత ఆటను కోల్పోతుంటే.. పాండ్యా మాత్రం మరింత అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్లో టైటాన్స్ తరఫున 487పరుగులు చేశాడు. అలాగే ఫైనల్లో అత్యుత్తమ బౌలింగ్, బ్యాటింగ్ ప్రదర్శనతో తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

అందుకే అతను ఫోర్ డైమెన్షనల్ ప్లేయర్
కిరణ్ మోరే SG పోడ్‌కాస్ట్‌తో మాట్లాడుతూ.. 'నాకు హార్దిక్ పాండ్యా ఇంకా చిన్న పిల్లాడిలానే తోస్తాడు. అతను అన్ని టైంలలో బెస్ట్ ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటాడు. అతను ఇప్పుడు ఫోర్ డైమెన్షనల్ ప్లేయర్ అని నేను నమ్ముతున్నా. అతను ఇంతకుముందు బౌలర్, బ్యాటర్, ఫీల్డర్ అయినందున త్రీడీ ప్లేయర్, కానీ ఇప్పుడు కెప్టెన్ కూడా కావడంతో అతను 4D ప్లేయర్. జాతీయ స్థాయిలో ఇంత ప్రతిభావంతుడైన క్రికెటర్‌ని కలిగి ఉండడం నిజంగా టీమిండియాకు గర్వకారణం' అని మోరే అన్నాడు.

హార్దిక్ కళ్లలో ఆ ఆకలిని చూశాను
'హార్దిక్ పాండ్యా చిన్నప్పుడు తన అన్నయ్య కృనాల్ పాండ్యాతో కలిసి నా కోచింగ్ అకాడమీకి వచ్చేవాడు. అతని అన్నయ్య కృనాల్ పాండ్యా నా అకాడమీలో చేరినప్పుడు.. అతనితో కలిసి హార్దిక్ పాండ్యా కూడా వచ్చేవాడు. అతను నెట్స్ వెనుక పరిగెడుతూ బంతిని పట్టుకునేవాడు. చాలా క్రికెట్ ఆడాలనే అభిలాష అతని కళ్లల్లో కన్పించేది. అప్పుడే తమ్ముడిని కూడా నెట్స్‌లోకి తీసుకురమ్మంటూ కృనాల్‌కు చెప్పాను. హార్దిక్ ప్రాక్టీసు చేస్తుంటే.. క్రికెట్ ఆట పట్ల ఎంత ఆకలితో ఉన్నాడో గమనించేవాడిని' అని మోరే తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications