For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబై ఇండియన్స్‌కు షాక్, భార్గవ్ ధాటితో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలుపు

By Pratap
Kings XI Punjab
జైపూర్: ఐపీఎల్‌-4లో దూసుకుపోతున్న సచిన్ సేన ముంబై ఇండియన్స్‌కు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ షాక్ ఇచ్చింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ చేతిలో చిత్తుగా ఓడింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' భార్గవ్‌ బట్‌ (4/22), ప్రవీణ్‌ (2/19)ల ధాటికి 12.5 ఓవర్లలో 87 పరుగులకే కుప్పకూలింది. 17 పరుగులు చేసిన పొలార్డే టాప్‌ స్కోరర్‌. మొదట పంజాబ్‌ 8 వికెట్లకు 163 పరుగులు చేసింది. షాన్‌ మార్ష్‌ (43; 34 బంతుల్లో 5X4) రాణించాడు. మునాఫ్‌ పటేల్‌ 5 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో పంజాబ్‌ సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

ప్రవీణ్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లో మూడు బౌండరీలు బాదిన బ్లిజార్డ్‌ ముంబయి ఇండియన్స్‌ లక్ష్యఛేదనను ధాటిగా ఆరంభించాడు. కానీ ఆ మెరుపులు ఆ ఒక్క ఓవర్‌కే పరిమితం. ఆ తర్వాత అంతా పతనమే. ప్రవీణ్‌ బౌలింగ్‌లో 19 వద్ద సచిన్‌ రూపంలో తొలి వికెట్‌ కోల్పోయిన ముంబయి తీవ్ర ఒత్తిడికి లోనైంది. పంజాబ్‌ బౌలర్లకు దాసోహమంది. వరుసగా వికెట్లు కోల్పోయింది. వచ్చిన బ్యాట్స్‌మన్‌ వచ్చినట్లే వెనుదిరిగారు. ఒక్క మెరుగైన భాగస్వామ్యమూ నమోదు కాలేదు. రోహిత్‌ బిపుల్‌ బౌలింగ్‌లో స్టంపౌట్‌ కాగా బ్లిజార్డ్‌ ఇన్నింగ్స్‌కు ప్రవీణ్‌ తెరదించాడు. అప్పటికి స్కోరు 27. ఆ తర్వాత సైమండ్స్‌, రాయుడు, సుమన్‌, హర్భజన్‌, పొలార్డ్‌, కులకర్ణి, మునాఫ్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. చివరి నాలుగు వికెట్లను భార్గవ్‌ బట్‌ పడగొట్టాడు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ గత మ్యాచ్‌లకంటే మెరుగ్గానే బ్యాటింగ్‌ చేసింది. మార్ష్‌, దినేశ్‌ కార్తీక్‌ (31; 24 బంతుల్లో 4X4, 1X6) గిల్‌క్రిస్ట్‌ (28; 28 బంతుల్లో 2X4, 1X6) రాణించారు. 11 ఓవర్లలో 96/2తో ఉన్న పంజాబ్‌ ఇంకా ఎక్కువ స్కోరే చేసేలా కనిపించింది. కానీ మునాఫ్‌ (5/21) విజృంభించడంతో 163తో సరిపెట్టుకుంది. మునాఫ్‌ కీలక సమయంలో ఒకే ఓవర్లో (16వ) షాన్‌ మార్ష్‌, డేవిడ్‌ హసిలను ఔట్‌ చేసి పంజాబ్‌ను దెబ్బతీశాడు. ఆ తర్వాత ఊపులో ఉన్న దినేశ్‌ కార్తీక్‌నూ వెనక్కి పంపాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+