
హైదరాబాద్: ఐపీఎల్ వేలానికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కొత్త ప్రణాళికతో అడుగుపెట్టింది. జట్టు సహ యజమాని అయిన ప్రీతి జింతా వేలంలో క్రికెటర్ పేరు అనౌన్స్ అవడమే ఆలస్యం కొనేందుకు సిద్ధమైపోతూ కనిపించింది. ఎవరూ ఊహించని రీతిలో కొనుగోళ్లు చేపట్టిన జట్టు ఇప్పుడు మరో ఆలోచనలో పడింది. జట్టు పేరు మారిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తోంది.
గత మూడు సీజన్లలోనూ జట్టు ప్రదర్శన మరీ పేలవంగా ఉండటంతో ఫ్రాంఛైజీ ఈ సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో.. పాటు ఈ ఏడాది సీజన్‌కి జట్టుకు ఏ పేరు పెట్టాలా అని యోచిస్తోంది. ఈ మేరకు బీసీసీఐకి ఇప్పటికే పేరు మార్పుపై దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పదేళ్ల ఐపీఎల్ చరిత్రలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఒక్కసారి మాత్రమే ఫైనల్ చేరింది. 2014 నుంచి కనీసం ప్లేఆఫ్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది. దీంతో వేలంలో మ్యాచ్‌ల్ని గెలిపించే ఆటగాళ్లపైనే ఫ్రాంఛైజీ ఎక్కువగా దృష్టి సారించి దక్కించుకుంది. ఆటగాళ్ల మార్పుతో పాటు జట్టు పేరు మార్పు పంజాబ్‌కి ఏ మేరకు టైటిల్‌ని తెచ్చిపెడుతుందో చూడాలి..!
ఐపీఎల్ 2018 సీజన్ ఆటగాళ్ల వేలంలో భారీ ధరకి స్టార్ క్రికెటర్లని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. బెంగళూరు వేదికగా గత శని, ఆదివారం జరిగిన ఈ వేలంలో రూ. 11 కోట్లకి ఓపెనర్ కేఎల్ రాహుల్‌ని దక్కించుకున్న పంజాబ్.. రవిచంద్రన్ అశ్విన్ (రూ.7.6కోట్లు), ఆండ్రూ టై (రూ.7.2కోట్లు), అరోన్ ఫించ్ (రూ.6.2 కోట్లు), స్టాయినిస్ (రూ.6.2కోట్లు), కరుణ్ నాయర్ (రూ.5.6కోట్లు), క్రిస్‌గేల్ (రూ.2కోట్లు) కొనుగోలుతో జట్టుని బలిష్టం చేసుకుంది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్
1. అక్షర్ పటేల్ (రూ.6.75 కోట్లు - Retained)
2. అశ్విన్ (రూ.7.6 కోట్లు)
3. యువరాజ్ సింగ్ (రూ.2 కోట్లు)
4. కరుణ్ నాయర్ (రూ.5.6 కోట్లు)
5. కేఎల్ రాహుల్ (రూ.11 కోట్లు)
6. డేవిడ్ మిల్లర్ (రూ.3 కోట్లు - RTM)
7. ఆరోన్ ఫించ్ (రూ.6.2 కోట్లు)
8. మార్కస్ స్టాయినిస్ (రూ.6.2 కోట్లు-RTM)
9. మయాంక్ అగర్వాల్ (రూ.కోటి)
10. అంకిత్‌సింగ్ రాజ్‌పుత్ (రూ.3 కోట్లు)
11. మనోజ్ తివారీ (రూ.కోటి)
12. మోహిత్ శర్మ (రూ.2.4 కోట్లు- RTM)
13. ముజీబ్ జర్దాన్ (రూ.4 కోట్లు)
14. బరిందర్ శరణ్ (రూ.2.2 కోట్లు)
15. అండ్రూ టై (రూ.7.2 కోట్లు)
16. అక్షదీప్ నాథ్ (రూ.కోటి)
17. బెన్ డ్వార్షుయిస్ (రూ.1.4 కోట్లు)
18. ప్రదీప్ సాహు (రూ.20 లక్షలు)
19. మయాంక్ దాగార్ (రూ.20 లక్షలు)
20. క్రిస్ గేల్ (రూ.2 కోట్లు)
21. మంజూర్ దార్ (రూ.20 లక్షలు)
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.