హైదరాబాద్: ఐపీఎల్ మ్యాచ్‌లో ఫీల్డ్ అంఫైర్ వాగ్వాదానికి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్ సందీప్ శర్మపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నారు. సందీప్ శర్మకి మ్యాచ్ రిఫరీ జరిమానా విధించారు. అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పెట్టారు.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
వివరాల్లోకి వెళితే గుజరాత్ లయన్స్‌తో ఆదివార మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్ సందప్ శర్మ ఫీల్డ్ అంపైర్ నంద కిశోర్‌తో వాదులాటకు దిగాడు. ఇషాన్ కిషాన్ బ్యాటింగ్ చేస్తుండగా తాను వేసిన బంతిని అంపైర్ నోబాల్‌గా ప్రకటించి ఫ్రీ హిట్ సిగ్నల్ ఇచ్చాడు.
దీనిపై అతడు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంపైర్‌తో నంద కిశోర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఇదే సమయంలో కింగ్స్ కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా అక్కడికి వచ్చాడు. ఓవర్ ముగిసిన తర్వాత అంపైర్ చేతిలోని తన క్యాప్‌ను కోపంగా లాక్కుని వెళ్లిపోయాడు సందీప్.