Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు కోచ్‌గా మైక్ హెస్సన్

Kings XI Punjab replace Brad Hodge with Mike Hesson as their head coach ahead of IPL 2019: Report

హైదరాబాద్: ఐపీఎల్ 2019కి గానూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో ప్రధాన మార్పు చోటు చేసుకుంటుంది. జట్టు ప్రధాన కోచ్ అయిన బ్రాడ్ హాడ్జ్ స్థానాన్ని న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హసన్ భర్తీ చేయనున్నాడు. మూడు సంవత్సరాలపాటు కొనసాగనున్న పదవి బాధ్యతలను హస్సెన్ తీసుకోనున్నాడు. ఐపీఎల్ సీజన్ 11లోని రెండో రౌండ్‌కే హాడ్జ్ పదవీ కాలం పూర్తి అయినా.. కొనసాగుతూనే వచ్చాడు.

రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్సీలో కొనసాగుతోన్న జట్టు గత సీజన్‌లో అదిరే ఆరంభాన్ని అందుకుంది. తొలి ఏడు మ్యాచ్‌లలో ఐదింటిలో విజయాన్ని చేజిక్కుంచుకుంది. సీజన్‌లోని తొలి భాగం పూర్తి అయిన తర్వాత విరామం నుంచి తిరిగొచ్చిన పంజాబ్ రెండో అర్థభాగంలో అస్సలు ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో ఏడు మ్యాచ్‌లకు ఆరు మ్యాచ్ లు మాత్రమే విజయాన్ని దక్కించుకున్నాయి.

గతేడాది లీగ్ దశను కూడా దాటలేకపోయిన పంజాబ్.. రానున్న ఏడాది బాగా రాణించగలదని జట్టు యజామాన్యం ఆలోచిస్తోంది. కింగ్సె ఎలెవన్ పంజాబ్ జట్టుకు మెంటార్‌గా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ వ్యవహరిస్తున్నాడు. జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపికైన హెస్సన్‌కు మాత్రం ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆడిన అనుభవం లేదు. కానీ, జాతీయ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది.

ఐపీఎల్ మాట అటుంచితే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని న్యూజిలాండ్ కోచ్‌గా హెస్సన్.. గ్యారి స్టడ్‌కు బదులుగా జూలై బాధ్యతలు అందుకోనున్నారు. కొద్ది నెలలుగా మాజీ క్రికెటర్లు సైతం ఇదే పోస్టుకు దరఖాస్తు చేసుకోగా అది మాత్రం హెస్సన్ మాత్రమే వరించింది.

Story first published: Monday, October 29, 2018, 15:03 [IST]
Other articles published on Oct 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+