ఒక్క కరోనా పాజిటీవ్ వచ్చినా.. ఐపీఎల్ కథ కంచికే: కింగ్స్ పంజాబ్ కో ఓనర్ నెస్ వాడియా

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంపై చర్చించకుండా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కో ఓనర్ నెస్ వాడియా అన్నాడు. ఐపీఎల్ జరుగుతుండగా ఒక్క పాజిటీవ్ కేసు వచ్చినా టోర్నీ మొత్తం నాశనం అవుతుందని హెచ్చరించాడు. అందుకే లీగ్‌ను అత్యంత కఠినంగా నిర్వహించాలని బీసీసీఐకి సూచించారు.

ఇక చైనా ఉత్పత్తులపై దేశవ్యాప్తంగా నెలకొన్న వ్యతిరేకత నేపథ్యంలో టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకోవాలని మొబైల్ కంపెనీ వివో నిర్ణయించుకుంది. దీంతో బీసీసీఐ రూ. 440 కోట్ల ఆదాయం కోల్పోనుంది.

సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు దుబాయ్ వేదికగా ఐపీఎల్ నిర్వహణకు సిద్దమైన బీసీసీఐకి.. వివో నిర్ణయం పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టింది. ఇంత తక్కువ సమయంలో మరో స్పాన్సర్‌తో పాటు అంత ఆదాయాన్ని తీసుకురావడం బోర్డుకు సవాల్‌గా మారింది.

ఇది హస్యాస్పదం..

ఇది హస్యాస్పదం..

వివో వ్యవహారం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం కాగా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఐపీఎల్ సమయంలో ఒక్క కరోనా పాజిటివ్ వస్తే.. సిస్టమ్ మొత్తం దెబ్బ తింటుందని నెస్ వాడియా అభిప్రాయపడ్డాడు.

‘ఐపీఎల్ టైటిల్ స్ఫాన్సర్‌ గురించి జరుగుతున్న చర్చలో అర్థం లేదు. హస్యాస్పదం కూడా. ఇప్పుడు మా ఆలోచనల్ని.. ఆటగాళ్లు, వారితో పాటు టోర్నీలో భాగస్వామ్యులయ్యే వారి భద్రత గురించే. టోర్నీ టైమ్‌లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు వచ్చినా.. ఐపీఎల్ నాశనం అవుతుంది.'అని ఫ్రాంచైజీల మధ్య బుధవారం జరిగిన సమావేశం అనంతరం నెస్ వాడియా వెల్లడించాడు.

చైనా కంపెనీలు ఎందుకు..?

చైనా కంపెనీలు ఎందుకు..?

సరిహద్దుల్లో నెలకొన్న ఘర్ఘణల నేపథ్యంలో ఐపీఎల్‌కు చైనా కంపెనీలను దూరంగా ఉంచాలని నెస్ వాడియా అభిప్రాయపడ్డాడు. టైటిల్ స్పాన్సర్‌గా వివో తప్పుకుంటే ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి వందల కంపెనీలున్నాయని తెలిపాడు. ‘టైటిల్ స్పానర్‌షిప్ గురించి బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకుందో నాకు తెలియదు. ఏదేమైనప్పటికీ ఐపీఎల్‌ను విజయవంతం చేయాలని ఫ్రాంచైజీ యజమానులు అందరం అనుకున్నాం. బోర్డుకు తాము అన్ని విధాలుగా అండగా ఉంటాం. త్వరలోనే మరో సమావేశం జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో స్పాన్సర్లు బేరసారాలు ఆడతారని తెలుసు.

నా పేరు మార్చుకుంటా..

నా పేరు మార్చుకుంటా..

ఈ సీజన్ ఐపీఎల్ ఎక్కువ మంది వీక్షించకపోతే నేను నా పేరే మార్చుకుంటాను. ఈ సీజన్ జరిగితే గత 12 సీజన్ల కన్నా బెస్ట్‌గా నిలుస్తోంది. కావాలంటే నా మాటలను గుర్తుంచుకొండి. ఈ ఏడాది ఐపీఎల్‌లో భాగం కాకపోవడానికి స్పాన్సర్లు ఏం తెలివితక్కువ వాళ్లు కాదు. వెనుకడుగు వేస్తే మాత్రం వ్యాపార పరంగా వారు తీసుకున్న ఓ పెద్ద తప్పుడు నిర్ణయం అవుతుంది. నేనే స్పాన్సర్ అయితే మాత్రం ఇప్పటికే ముందుండేవాడిని' అని నెస్ వాడియా తెలిపాడు.

కఠిన పరిస్థితుల్లో..

కఠిన పరిస్థితుల్లో..

ఐపీఎల్ కోసం దుబాయ్‌కు వెళ్లే విషయంపై వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న వాడియా.. భద్రత విషయంలో మాత్రం ఎట్టిపరిస్థితుల్లో రాజీపడలేమన్నాడు. ‘మేం బయోసెక్యూర్ వాతావరణాన్ని సర్దుబాటు చేసుకోవడంతో పాటు అలవాటు చేసుకోవాలి. ఒక్క కేసు ఐపీఎల్‌ను నాశనం చేయగలదు. కఠిన పరిస్థితుల కారణంగా సాధారణ ప్రజలు కూడా ఆసాధారణమైన పనులు చేయాల్సి ఉంటుంది'అని ఈ కింగ్స్ పంజాబ్ కో ఓనర్ చెప్పుకొచ్చాడు.

IPL 2020: ఫ్రాంచైజీల గొంతెమ్మ కోరికలు.. బీసీసీఐ ఉక్కిరిబిక్కిరి!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, August 6, 2020, 16:08 [IST]
Other articles published on Aug 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X