Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ ఫీల్డర్ జాంటీ.. అతడికే క్యాచ్‌లు నేర్పిస్తున్న మయాంక్‌ (వీడియో)

Kings XI Punjab batsman Mayank Agarwal Swaps Coaching Role With Jonty Rhodes

దుబాయ్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 సీజన్‌ కోసం యూఏఈకి వెళ్లిన అన్ని జట్లు ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఐపీఎల్ 13వ సీజన్‌కు ఇంకా వారం రోజులే ఉండడంతో జట్లన్నీ ప్రాక్టీస్ ముమ్మరం చేశాయి. కొన్ని జట్లు నైట్ సెషన్‌లో కూడా పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ ఆటగాళ్లు దుబాయ్‌లో కష్టపడుతున్నారు. అందని ద్రాక్ష లాగే ఉన్న ఐపీఎల్ టైటిల్‌ను ఈసారైనా ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్నారు. అయితే పంజాబ్ ప్రాక్టీస్‌ సెషన్‌లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది.

క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ ఫీల్డర్‌:

క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ ఫీల్డర్‌:

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ ఫీల్డర్‌గా అతడు గుర్తింపు పొందాడు. జట్టు కోసం మైదానంలో ఎన్నో సాహసాలు చేశాడు. ఎన్నో పరుగులు జట్టుకు సేవ్ చేశాడు.. మరెన్నో క్యాచులు అందుకున్నాడు. జాంటీ తన ఫీల్డింగ్‌ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అలాంటి టాప్ క్లాస్ ఫీల్డర్ జాంటీ రోడ్స్‌కే క్యాచ్‌లు నేర్పిస్తున్నాడు కింగ్స్‌ ఎలెవెన్ పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ అగర్వాల్‌.

జాంటీ రోడ్స్‌కే కోచింగ్‌:

జాంటీ రోడ్స్‌కే కోచింగ్‌:

కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ తమ ఫీల్డింగ్‌ కోచ్‌గా జాంటీ రోడ్స్‌ని నియమించుకుంది. శుక్రవారం రాత్రి జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో జాంటీ క్యాచులు పట్టాడు. ఇక పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ అగర్వాల్‌ ఫీల్డింగ్‌ కోచ్‌ అవతారమెత్తాడు. మయాంక్‌.. జాంటీ రోడ్స్‌కే కోచింగ్‌ ఇచ్చాడు. మయాంక్‌ ఒక చేత్తో బ్యాట్‌ పట్టుకొని మరో చేతికి గ్లౌస్‌ తొడిగి బంతిని జాంటీ వైపు కొట్టాడు. ఆ బంతులను జాంటీ క్యాచ్‌లు పట్టాడు. దీనికి సమందించిన వీడియోను కింగ్స్‌ ఎలెవెన్‌ తమ ట్విటర్‌లో పంచుకుంది. 'మయాంక్‌.. జాంటీకీ కోచింగ్‌ ఇస్తున్నాడా? అసలు ఇది నిజమేనా?' అని కాప్షన్ పెట్టింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.

 77 ఐపీఎల్ మ్యాచ్‌లు.. 1266 పరుగులు:

77 ఐపీఎల్ మ్యాచ్‌లు.. 1266 పరుగులు:

2011 నుంచి ఐపీఎల్ ఆడుతున్న మయాంక్ అగర్వాల్‌‌.. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేకపోయాడు. టీమిండియాలో, దేశవాళీలో ఎంత బాగా ఆడుతున్నా.. దాన్ని ఐపీఎల్‌లో కొనసాగించలేకపోతున్నాడు. 77 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన మయాంక్‌.. 1266 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో కేవలం ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 68. ఇక భారత్ తరఫున 11 టెస్టులు, 3 వన్డేలు ఆడాడు. టెస్టులో మూడు శతకాలు బాదాడు.

గతేడాది టెస్టుల్లో అరంగేట్రం:

గతేడాది టెస్టుల్లో అరంగేట్రం:

మయాంక్ అగర్వాల్‌ గతేడాది టెస్టుల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో ఆడిన టెస్టు సిరీస్‌లో స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్ ‌శర్మతో కలిసి శుభారంభాలు చేశాడు. శతకాలతో ఆకట్టుకున్నాడు. సెప్టెంబర్ 19నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 2020 కోసం తీవ్రంగా సాధన చేస్తున్నాడు. అన్ని జట్లకన్నా ముందు దుబాయ్‌కి చేరుకున్న కింగ్స్.. ప్రాక్టీస్‌ మమ్మురంగా చేస్తోంది. ఇన్ని సీజన్లు విఫలమయిన మయాంక్‌.. ఈ సీజన్‌లో చెలరేగిపోవాలని భావిస్తున్నాడు. 20న పంజాబ్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.

Story first published: Saturday, September 12, 2020, 17:17 [IST]
Other articles published on Sep 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+