'గత పదేళ్లల్లో ఒక్కసారైనా మంచి ప్రదర్శన చేయలేకపోయా.. ఈసారి మాత్రం అలా జరగదు'

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఒక్కసారి కూడా రాణించకపోవడంపై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్నా ఐపీఎల్‌లో రాణించకపోవడం బాధగా ఉందని కర్ణాటక బ్యాట్స్‌మన్, టీమిండియా టెస్ట్ ఓపెనర్ పేర్కొన్నాడు. ఈసారి మాత్రం విజేతగా నిలిచే జట్టులోని సభ్యుడిగా ఉండాలని కోరుకుంటున్నానన్నాడు. 2011 నుంచి ఐపీఎల్ ఆడుతున్న మయాంక్.. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేకపోయాడు.

ఈసారి అలా జరగదు:
తాజాగా మయాంక్ అగర్వాల్ ఈఎస్‌పీఎన్‌తో మాట్లాడుతూ... 'దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగులు తీస్తున్నా.. ఈ పదేళ్లల్లో ఒక్కసారైనా ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేయలేకపోయాను. ఇది ఒప్పుకోవాల్సిన విషయమే. చాలా బాధగా ఉంది. అయితే ఈసారి మాత్రం అలా జరగకుండా ఉండాలని ఆశిస్తున్నా. అలాగే నేను విజేతగా నిలిచే జట్టులోని సభ్యుడిగా ఉండాలని కోరుకుంటున్నా. 2017లో రైజింగ్ పుణె సూపర్ గెయింట్ తరఫున ఆడినప్పుడు తృటిలో ఆ అవకాశం కోల్పోయా' అని చెప్పాడు.

వారితో డ్రెస్సింగ్ రూమ్ అంతా సందడే:
'కేఎల్ రాహుల్, నేను ఒకేసారి క్రికెట్ ఆరంభించాం. ఇద్దరం భారత్ తరఫున అండర్ 19లో కలిసి ఆడాం. అంతర్జాతీయ స్థాయిలో టెస్టులో ఓపెనింగ్ చేశాం. మేము ప్రపంచకప్ జట్టులో పాల్గొన్నాం. అతడు కెప్టెన్సీ వహించడం ఇదే మొదటిసారి. అందుకు నేను చాలా సంతోషిస్తున్నా' అని మయాంక్ అగర్వాల్ పేర్కొన్నాడు. జట్టులో కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, గ్లెన్ మాక్స్‌వెల్, నికోలస్ పూరన్ లాంటి స్టార్ బ్యాట్స్‌మన్ ఉన్నారని.. వారితో డ్రెస్సింగ్ రూమ్ అంతా సందడిగా ఉంటుందన్నాడు.

77 ఐపీఎల్ మ్యాచ్‌లు.. 1266 పరుగులు:
జట్టులోని ప్రతీ ఒక్కరూ మైదానంలో రెచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటారని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్ తెలిపాడు. ఎప్పుడైనా కేఎల్ రాహుల్, క్రిస్ గేల్ లాంటి ఓపెనర్ల తర్వాత బ్యాటింగ్ చేయడానికి వెళ్లాల్సి వస్తే తనకు పెద్దగా ఇబ్బంది ఉండదని, అప్పుడు ఒత్తిడేమీ ఉండదని చెప్పుకొచ్చాడు. 77 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన మయాంక్.. 1266 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో కేవలం ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 68. ఇక భారత్ తరఫున 11 టెస్టులు, 3 వన్డేలు ఆడాడు. టెస్టులో మూడు శతకాలు బాదాడు.

గతేడాది టెస్టుల్లో అరంగేట్రం:
మయాంక్ అగర్వాల్ గతేడాది టెస్టుల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో ఆడిన టెస్టు సిరీస్‌లో స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మతో కలిసి శుభారంభాలు చేశాడు. శతకాలతో ఆకట్టుకున్నాడు. సెప్టెంబర్ 19నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2020 కోసం తీవ్రంగా సాధన చేస్తున్నాడు. అన్ని జట్లకన్నా ముందు దుబాయ్‌కి చేరుకున్న కింగ్స్.. గత వారం నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఇన్ని సీజన్లు విఫలమయిన మయాంక్.. ఈ సీజన్‌లో చెలరేగిపోవాలని భావిస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications