కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్‌ను చిత్తు చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 66 పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ముచ్చటగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. గాయం కారణంగా సచిన్ ఈ మ్యాచ్ లో కూడా ఆడకపోవడంతో హర్భజన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. కీలక పోరులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మంచి ఆటతీరును కనబర్చింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్భజన్ ఆహ్వానం మెరకు తొలి బ్యాటింగ్ చెసిన కింగ్స్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది. ఓపెనర్లు గోల్... ఇర్ఫాన్ పఠాన్‌లు స్వల్ప స్కోరుకే ఔటైనా ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన సంగాక్కర ముంబై ఇండియన్ బౌలర్ల పై ఏదురు ధాడికి దిగాడు. 13 ఫోర్లు ఒక సిక్సర్‌తో 18 పరుగులు చేసిన కెప్టెన్ యువరాజ్ సింగ్‌ను షాన్ పోలాక్ బోల్తా కోట్టించాడు. దీంతో 107 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో పట్టు బిగించిన ముంబై ఇండియన్స్ బౌలర్లు వరుస వికెట్లను తీశారు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌లను నిలదొక్కుకోకుండా చేశారు. శరవణన్ ...జయవర్థనేలతో పాటు టెలెండర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో నిర్ణిత 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది. అయితే సంగాక్కర సంగక్కఒక్కడే 56 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ తో 94 పరుగులు చేసి రాణించాడు. సెంచరీ దిశగా దూసుకేళ్లుతున్న సంగాక్కరను హర్భజన్ ఔట్ చేశాడు.
ఇక ముంబై జట్టులో హర్భజన్ సింగ్ 3 వికెట్లును పడగొట్టగా, నేహరా కులకర్ణిలు తలో రెండు వికెట్లు తీశారు. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ప్రారంభం నుంచి తడబడింది. ఓపెనర్లు తక్కవ స్కోరుకే పెవిలియన్‌కు చేరుకోవడంతో ఊతప్ప .. బ్రేవో.. తివారి.. పోలాక్‌లు కొద్ది సేపు మెరుపులు మెరిపించినా భారీ స్కోరును సాధించ లేకపోయారు. కింగ్ ఎలెవన్ బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన ముంబై ఇండియన్ బ్యాట్స్‌మెన్‌లు పెవిలియన్ దారి కట్టాడంతో 17.2 ఓవర్లలోనే 116 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ జట్టులో బ్రేవో అత్యధికంగా 23 పరుగులు చేయగా, ఊతప్ప 21, పోలాక్ 22 పరుగుల చేశారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో పఠాన్ శ్రీశాంత్ చావ్లాలు తలో రెండు వికెల్లు పడగొట్టగా, బ్రెట్ లీ, విఆర్‌వీ సింగ్‌లు చెరో వికెట్‌ను తీసి జట్టు గెలుపులో కీలక పాత్ర పొషించారు.