
పీలేతో గంగూలీ చిన్ననాటి జ్ఞాపకాలు
38 ఏళ్ల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రేక్షకుల్లో కొంత మంది పుట్టి ఉండకపోవచ్చని అన్నారు. ఇప్పుడు కొత్త తరాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. మారడోనా, మెస్సీల్లో ఎవరు గొప్ప అని అడిగిన ప్రశ్నకు గాను ఇద్దరూ చాలా మంచి ఆటగాళ్లంటూ కితాబిచ్చాడు.

పీలేతో గంగూలీ చిన్ననాటి జ్ఞాపకాలు
సాకర్ దిగ్గజం పీలేని కలిసిన సౌరవ్ గంగూలీ తన చిన్ననాటి జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నాడు. ‘1977లో మోహన్ బగాన్ తో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్ లో ఆడేందుకు తొలిసారి కోల్ కతాకు పీలే వచ్చారు. అప్పుడు నా వయస్సు ఐదు సంవత్సరాలు. పీలేను నల్లముత్యంగా అభిమానులు పిలుచుకోవడం నాకు ఇప్పటికీ గుర్తుంది' అంటూ సౌరవ్ గంగూలీ అన్నారు.

పీలేతో గంగూలీ చిన్ననాటి జ్ఞాపకాలు
బ్రెజిల్‌ను మూడు సార్లు విశ్వ విజేతగా నిలిపిన పీలే ఆల్ టైం ఫుట్ బాల్ అంబాసిడర్ అంటూ కొనియాడాడు. తాను యుక్త వయసులో ఉన్నప్పుడు పీలే ఆడే మ్యాచ్‌లను క్రమం తప్పకుండా చూసేవాడినని గంగూలీ తెలిపాడు. నిజంగా ఆయన ఆట అద్భుతం అంటూ పీలేపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు.

పీలేతో గంగూలీ చిన్ననాటి జ్ఞాపకాలు
'ఆటల గురించి నాకేమీ తెలియదు. క్రీడల్లో కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ మాత్రమే తెలుసు. పీలే ఎవరో తెలియకుండానే అతడి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమాకి సంగీతం అందిచాను. సినిమా చూశాక ఏడ్చేశా' అని మొదటిసారి పీలేను కలిసిన అనంతరం ఏఆర్ రెహ్మాన్ చెప్పాడు.

పీలేతో గంగూలీ చిన్ననాటి జ్ఞాపకాలు
అంతక ముందు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పీలేను సన్మానించారు. కాగా, ఆదివారం భారత్‌కు చేరుకున్న సాకర్ దిగ్గజం పీలేకు భారత్‌లో ఘన స్వాగతం లభించింది. 38 ఏళ్ల అనంతరం ఆదివారం ఉదయం ఇక్కడికి వచ్చిన ఆయనకు స్థానిక అభిమానులు బ్రహ్మరథం పట్టారు.

పీలేతో గంగూలీ చిన్ననాటి జ్ఞాపకాలు
‘పీలే.. పీలే' అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఆయన్ని స్వాగతించారు. దీనికి పులకించిన 74 ఏళ్ల పీలే తన వాహనం నుంచి అందరికీ చేయి ఊపుతూ అభివాదం చేశారు. విమానాశ్రయం నుంచి పీలేను వాహనం దగ్గరికి తీసుకెళ్లడం పోలీసులకు కష్టంగా మారింది. రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీం, నిర్వాహకులు పీలేకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











