ధోని తర్వాత కోహ్లీనే: అత్యంత వేగంగా 11వేల పరుగులు చేసిన కెప్టెన్‌గా!

హైదరాబాద్: పూణె వేదికగా శుక్రవారం శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యంత వేగవంతంగా 11వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న కెప్టెన్‌గా సరికొత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
శుక్రవారం శ్రీలంకతో మూడో టీ20లో తొలి పరుగు తీసి కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు. కెప్టెన్‌గా 169 మ్యాచ్‌ల్లో కోహ్లి 11వేల అంతర్జాతీయ పరుగుల్ని సాధించాడు. కెప్టెన్‌గా 11వేలు, అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన జాబితాలో స్టీఫెన్ ఫ్లెమింగ్(న్యూజిలాండ్), ధోని(భారత్), అలెన్ బోర్డర్(ఆస్ట్రేలియా), గ్రేమ్ స్మిత్(దక్షిణాఫ్రికా), రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా)లు ఉన్నారు.
కాగా, భారత్ తరఫున ఈ ఫీట్ సాధించిన రెండో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. కోహ్లీ కంటే ముందు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్‌గా 11వేలకు పైగా అంతర్జాతీయ పరుగుల్ని సాధించాడు. రికీ పాంటింగ్ 324 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసి 15,440 పరుగులు చేయగా, గ్రేమ్ స్మిత్ 286 మ్యాచ్‌ల్లో 14, 878 పరుగులు చేశాడు.

332 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసి ధోని 11, 207 పరుగులు
ఫ్లెమింగ్ 303 మ్యాచ్‌ల్లో 11,561 పరుగులు చేయగా, ధోని 332 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసి 11, 207 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే, శుక్రవారం పూణె వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంకను 15.5 ఓవర్లలో 123 పరుగులకే కట్టడి చేసిన భారత్.. వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

2-0 తేడాతో సిరిస్ భారత్ కైవసం
ఫలితంగా సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. రెండో టీ20లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. శార్దూల్‌కి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కగా.. సిరీస్‌లో అద్భత ప్రదర్శన చేసిన నవ్‌దీప్ సైనీకి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు దక్కింది. 202 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన లంకకు బుమ్రా తొలి ఓవర్‌లోనే షాక్ ఇచ్చాడు.

తొలి ఓవర్ చివరి బంతికి
తొలి ఓవర్ చివరి బంతికి ఓపెనర్ గుణతిలక (1) వాషింగ్టన్ సుందర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి అవిష్క పెర్నాండో (9) శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇక బుమ్రా వేసిన నాలుగో ఓవర్‌లో ఒషాడా ఫెర్నాండో (2)ను మనీశ్ పాండే రనౌట్ చేశాడు. దీంతో కీలక వికెట్లు కోల్పోయిన లంక కష్టాల్లో పడింది.

కుషాల్ పెరీరా క్లీన్ బౌల్డ్
నవ్‌దీప్ సైనీ వేసిన ఆరో ఓవర్ మొదటి బంతికి కుషాల్ పెరీరా (7) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే కష్టాల్లోపడ్డ జట్టును ఎంజిలో మ్యాథ్యూస్, ధనుంజయ డి సెల్వ ఆదుకొనే ప్రయత్నం చేశారు. వీరిద్దరు కలిసి 68 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వాషింగ్టన్ సుందర్ వేసిన 12వ ఓవర్‌లో మ్యాథ్యూస్ (31) పాండేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

123 పరుగులు చేసి అలౌటైన శ్రీలంక
ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన దాసున్ శనక (9), వానిండు హసరంగా (0), లక్షన్ సందకన్ (1) త్వరగానే పెవిలియన్ చేరారు. వికెట్లు పడుతున్నా ధనుంజయ మాత్రం పట్టువదలలేదు. 36 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సులతో 57 పరుగులు చేసాడు. కానీ.. నవ్‌దీప్ సైనీ బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన మలింగా (0) సైనీ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇవ్వడంతో శ్రీలంక 15.5 ఓవర్లలో 123 పరుగులు చేసి ఆలౌటైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications