King His Back: కోహ్లీ ఫ్యాన్స్ కాలర్ ఎగురవేయండి.. సెంచరీతో మూడేళ్ల నిరీక్షణకు తెర, ఆఫ్ఘన్ ముందు టఫ్ టార్గెట్

ఇప్పటికే ఆసియా కప్ టోర్నీ ఫైనల్ అవకాశాన్ని చేజార్చుకున్న టీమిండియా.. సూపర్ 4లో ఇవ్వాళ చివరి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతున్న సంగతి తెలిసిందే. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ గురించి కన్నా.. కోహ్లీ గురించి మాట్లాడుకుంటే బెటర్. కింగ్ సెంచరీ కోసం మూడేళ్లుగా వేచిచూస్తున్న అభిమానుల దాహాన్ని కోహ్లీ తీర్చాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లీ పూర్తిగా మునుపటి కోహ్లీలా ఆడాడు. షాట్లలో ఎడ్జ్ లేదు. హిట్టింగ్‌కు తిరుగులేదు. బౌలర్లు ఎవరనే పని లేదు. స్టేడియం నలువైపులా బౌండరీల మోత మోగించాడు. కోహ్లీ ఆటను చూసి మైమరిచిపోయే అభిమాని ఉండడు. ఆఫ్ఘన్ బౌలింగ్ తుత్తునియలు చేస్తూ కోహ్లీ సాగించిన దండయాత్రకు స్కోరుబోర్డు బులెట్ వేగంతో దూసుకుపోయింది.

టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక స్కోరు కోహ్లీదే..!
తన అమ్ములపొదిలో ఉన్న అన్ని అస్త్రశస్త్రాలతో కోహ్లీ బ్యాట్ ఎక్కుపెట్టాడు. ఇక సెంచరీ తర్వాత ప్రేక్షకులకు అభివాదం చేసిన కోహ్లీ తన మెడలో ఉన్న చైన్‌ను ముద్దాడి సెంటిమెంట్ సెలబ్రేట్ చేసుకున్నాడు. సెంచరీ తర్వాత కోహ్లీ ముఖంలో తొణికిసిలాడిన ఆనందం చూస్తుంటే.. సగటు అభిమాని మనసు పరవశంతో పొంగిపోక మానదు. ఇకపోతే కోహ్లీకి ఇది అంతర్జాతీయ కెరీర్లో 71వ సెంచరీ కాగా.. టీ20ల్లో తొలి సెంచరీ కావడం విశేషం. ఇకపోతే టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక స్కోరు కూడా కోహ్లీదే (122నాటౌట్).

ఆఫ్ఘన్ బౌలింగ్ తుత్తునియలు చేసిన రాహుల్, కోహ్లీ
ఇక ఈ మ్యాచ్ సంగతికొస్తే.. భారత పూర్తి స్థాయి కెప్టెన్ రోహిత్‌కు టీం మేనేజ్‌మెంట్ రెస్ట్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించాడు. ఇక ఈ మ్యాచ్ టాస్ గెలిచిన ఆఫ్ఘన్ కెప్టెన్ నబీ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ టాస్ ఓడిపోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగింది. దుబాయ్ స్టేడియంలో టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లే అనే సెంటిమెంట్‌కు తూట్లు పొడిచేలా భారత బ్యాటింగ్ సాగింది. కోహ్లీ (122పరుగులు 61బంతుల్లో 12ఫోర్లు, 6సిక్సర్లు నాటౌట్), కేఎల్ రాహుల్ (62పరుగులు 41బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సులు) దండయాత్ర మొదలెట్టారు. వీరిద్దరి జోరుకు 11ఓవర్లకే స్కోరు వంద దాటింది. ఇక రాహుల్, కోహ్లీ కలిసి 119పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

సిక్స్ కొట్టి సెంచరీ మార్క్ అందుకున్న కోహ్లీ
ఆ తర్వాత రాహుల్, సూర్యకుమార్ (6) త్వరత్వరగానే ఔటయిన పంత్ (20పరుగులు)తో కోహ్లీ చిచ్చురేపాడు. ఈ క్రమంలో 19వ ఓవర్ 2బంతికి సిక్స్ కొట్టి సెంచరీని అందుకున్నాడు. 20వ ఓవర్లో కూడా రెండు సిక్సులు, ఫోర్ కొట్టడంతో 18పరుగులు వచ్చాయి. తద్వారా భారత్ నిర్ణీత 20ఓవర్లలో 2వికెట్లు కోల్పోయి 212పరుగులు చేసింది. ఇక 213పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగబోతున్న ఆఫ్ఘన్ ఏం చేస్తుందో చూడాలి.

తుది జట్లు :
భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(కెప్టెన్), కరీం జనత్, రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్, ఎఫ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications