Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ సెంచరీ దెబ్బకు ఉలిక్కిపడ్డ రికార్డులు.. ఈ ఇన్నింగ్స్ ద్వారా నమోదైన టాప్ 10రికార్డులు, మైలురాళ్లు..!

King is Back : Top 10 Records Of Virat kohli after He did century against Afghanistan

సూపర్ 4లో చివరి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్‌‌తో ఆడిన టీమిండియా ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌‌లో గెలుపోటములను పక్కనపెడితే కింగ్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో మునుపటి టచ్ కన్పిస్తూ చెలరేగిపోయాడు. 1019రోజుల నిరీక్షణకు తెరదించుతూ సెంచరీతో కదం తొక్కాడు. కోహ్లీ బ్యాట్ నుంచి 70సెంచరీలు అలవోకగా రాగా.. ఈ సెంచరీ మాత్రం అంతులేని స్ట్రగుల్ నుంచి వచ్చింది. పేలవ్ ఫామ్‌తో జట్టుకు భారమవుతున్నాడు తీసి పారేయండంటూ మాజీ క్రికెటర్లు కొందరు విమర్శలకు దిగారు.. కోహ్లీ వల్ల జట్టు కూర్పు దెబ్బతింటుందంటూ విశ్లేషకుల కామెంట్లు, ఇలా చేస్తే ఫాంలోకి వస్తావ్ అంటూ లెక్కలేనన్నీ సూచనలు, ఇలా ఎవరికీ వారు కోహ్లీ గురించి ఎన్నెన్నో మాట్లాడారు. నెట్టింట చోక్లీ భాయ్ పనైపోయిందంటూ కొందరు నెటిజన్లు పోస్టులు పెట్టారు. బరిలోకి దిగి సింహంలా చెలరేగే కోహ్లీ.. ఔటయిన ప్రతిసారి చిన్నబుచ్చుకుని వస్తుంటే దెప్పిపొడిచే కామెంట్లతో అతనిపై అవమానకర ట్రోల్స్ చేశారు. కానీ ఒక్క ఇన్నింగ్స్ దెబ్బతో వాళ్ల నోళ్లన్నీ, ట్రోళ్లన్నీ మూతపడేలా చేశాడు విరాట్ భాయ్..

రికార్డుల రారాజుకు దాసోహమన్న రికార్డులు

తన సత్తా కించిత్ కూడా తగ్గలేదన్నట్లు మెరుపు షాట్లతో స్టేడియం నలుదిక్కులా బౌండరీల మోత మోగించాడు. 71వ సెంచరీ అందుకున్నాడు. సెంచరీ అనంతరం కోహ్లీ చిందించిన చిరునవ్వు సగటు అభిమాని గుండెను తాకిందంటే అతిశయోక్తి కాదు. షాట్లలో ఎడ్జ్ లేదు. హిట్టింగ్‌కు తిరుగులేదు. బౌలర్లు ఎవరనే పని లేదు అనేలా సాగించిన ఈ ఇన్నింగ్స్ అద్భుత: ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లీ (122పరుగులు 61బంతుల్లో 12ఫోర్లు, 6సిక్సర్లు నాటౌట్) కడవరకు క్రీజులో ఉండి.. జట్టు స్కోరు 212పరుగులు చేరుకునేలా ఆడాడు. ఇక తొలి ఓవర్లో ఎలాంటి ఉత్తేజంతో కన్పించాడో చివరి ఓవర్లోనూ అదే ఉత్తేజంతో కన్పించి ఫిట్ నెస్ కా బాప్ అనేదానికి మరోసారి నిదర్శనంగా నిలిచాడు. ఇక ఈ ఇన్నింగ్స్ దెబ్బకు ఎన్నో రికార్డులు, మైలురాళ్లు ఉలిక్కిపడ్డాయి. రికార్డుల రారాజుకు మరోసారి దాసోహమన్నాయి. ఒక్కసారి అందులో ఓ టాప్ 10 పరిశీలిస్తే..

ఈ ఇన్నింగ్స్ ద్వారా కోహ్లీ రికార్డులు, మైలురాళ్లు

1. అంతర్జాతీయ కెరీర్లో ఇది కోహ్లీ 71వ సెంచరీ

2. ఇంటర్నేషనల్ టీ20ల్లో కోహ్లీకి ఇది తొలి సెంచరీ

3.సచిన్ (100) తర్వాత అంతర్జాతీయ కెరీర్లో అత్యధిక సెంచరీలు (71) కోహ్లీవే

4..అంతర్జాతీయ కెరీర్లో 24,000పరుగుల మైలురాయికి చేరుకున్నాడు

5.ఇండియా తరఫున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (122నాటౌట్)

6.ఇంటర్నేషనల్ టీ20ల్లో 100సిక్సులు పూర్తి

7.అంతర్జాతీయ కెరీర్లో 250 సిక్సులు పూర్తి

8.ఇంటర్నేషనల్ టీ20ల్లో 3500పరుగుల మైలురాయి

9.ఇంటర్నేషనల్ టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు (33)

10.ఆసియా కప్ 2022లో అత్యధిక పరుగులు (276)

బ్యాటింగ్లో కోహ్లీ.. బౌలింగ్లో భువీ చెలరేగడంతో..

ఇక ఈ మ్యాచ్ సంగతికొస్తే.. భారత పూర్తి స్థాయి కెప్టెన్ రోహిత్‌కు టీం మేనేజ్‌మెంట్ రెస్ట్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించాడు. భారత్ టాస్ ఓడిపోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన కోహ్లీ (122పరుగులు 61బంతుల్లో 12ఫోర్లు, 6సిక్సర్లు నాటౌట్), కేఎల్ రాహుల్ (62పరుగులు 41బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సులు) దండయాత్ర మొదలెట్టారు. చివర్లో పంత్ (20పరుగులు) పర్వాలేదనిపించాడు. దీంతో స్కోరు 2వికెట్లు కోల్పోయి 212పరుగులకు చేరుకుంది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘన్ భువీ కెరీర్ బెస్ట్ బౌలింగ్ (5/4) 5వికెట్ల హాల్ దెబ్బకు ఆఫ్ఘన్ కుప్పకూలింది. 111పరుగులకే పరిమితమైంది. దీంతో ఇండియా 101పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

Story first published: Friday, September 9, 2022, 8:07 [IST]
Other articles published on Sep 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+