వీడ్కోలు సమావేశం.. మాజీ ప్రియురాలితో యువరాజ్ నైట్ పార్టీ

సిక్సర్ల వీరుడు, 2011 ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. టీమిండియాకు ఒంటిచేత్తో ఎన్నో విజయాలు అందించిన యువీ 2007, 2011 ప్రపంచకప్‌లో తన బ్యాట్ జులిపించి కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన యువీ తాజాగా తన సన్నిహితులతో వీడ్కోలు సమావేశం ఏర్పర్చుకొని గ్రాండ్ పార్టీ ఇచ్చారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రియురాలితో ఎంజాయ్:
ఈ పార్టీని శనివారం రాత్రి ముంబైలో ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి పలువురు భారత మాజీ ఆటగాళ్లు, యువీ స్నేహితులు, బాలీవుడ్ నటీనటులు హాజరయ్యారు. ఇక యువీ మాజీ ప్రేయసి, బాలీవుడ్ నటి కిమ్ శర్మ కూడా హాజరయ్యారు. పార్టీలో ఈ బ్యూటీ తెగ సందడి చేసింది. యువరాజ్‌తో కలిసి పార్టీలో తెగ ఎంజాయ్ చేసింది. యువరాజ్, కిమ్ శర్మ కలిసి చెట్టాపట్టాలేసుకు తిరుగటంతో ఈ పార్టీలో వారే హైలెట్ అయ్యారు.

ఫొటోలకు పోజులు:
ఒకవైపు మాజీ ప్రేయసి, మరోవైపు భార్య హెజల్ కిచ్‌తో కలిసి యువీ ఫొటోలకు పోజిచ్చాడు. గతంలో యూవీ, కిమ్ శర్మ లవర్స్ కావడంతో ఈ ముగ్గురి తాలూకు పిక్స్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. కిమ్ శర్మతో కలిసి యువీ ఎంజాయ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. భార్యను పక్కనే పెట్టుకొని ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్నాడంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

పీకల్లోతు ప్రేమలో:
క్రికెట్ ఆడుతూనే బాలీవుడ్ భామలతో డేటింగ్స్, షికార్లు చేసాడు యువీ. దాదాపు ఏడుగురు బాలీవుడ్ హీరోయిన్స్‌తో ఆయన చెట్టాపట్టాలేసుకు తిరిగాడనే రూమర్స్ ఉన్నాయి. ఆ లిస్టులో ఒకరే కిమ్ శర్మ. ఈ బాలీవుడ్ బ్యూటీతో ఒకప్పుడు యువీ పీకల్లోతు ప్రేమలో మునిగితేలాడు. దాదాపు నాలుగు సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత 2007లో ఈ ఇద్దరు విడిపోయారు.

ఎప్పటికీ మరువలేము:
జూన్ 10వ తేదీన యువీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలో కిమ్ శర్మ రియాక్ట్ అయింది. 'యూవీ ఇన్నాళ్లు అద్భుతమైన ఆట తీరును కనబర్చాడు. గ్రౌండ్‌లో ఆయన ఆట, నెలకొల్పిన రికార్డులు ఎప్పటికీ మరువలేము. హేజల్ కీచ్‌తో నీ మిగతా జీవితం కూడా ఇలానే విజయవంతం కావాలని కోరుకుంటున్నా' అని కిమ్ శర్మ ట్విట్టర్ వేదికగా పేర్కొంది.

304 వన్డేలు.. 8701 పరుగులు:
యువీ మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 304 వన్డే మ్యాచ్‌ల్లో 8701 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications