Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీని ఆరాధిస్తా, కానీ విరాట్ కోహ్లీ బెట్టర్‌: కిమ్ హ్యూస్

పెర్త్: భారత్‌కు ఎన్నో విజయాలను సాధించి పెట్టిన కెప్టెన్ ధోనీ కంటే కూడా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీనే బెటరంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ కిమ్ హ్యూస్. కోహ్లీ నాయకత్వాన్ని కేవలం టెస్టులకే పరిమితం చేయకుండా మిగతా ఫార్మాట్లకు కూడా విస్తరించాలని కిమ్ సూచించాడు. ఆటగానిలా మాత్రమే ధోనీని తాను ఆరాధిస్తాననని చెప్పాడు.

ఎందుకంటే మిగతా ఫార్మాట్లలాగా టెస్టుల్లో ధోనీ ఆటతీరు అంత బాగాలేదని అన్నాడు కోహ్లీకి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడం సంతోషంగా ఉందని చెప్పాడు టీమ్ ఇండియా కెప్టెన్సీకి కోహ్లీ ఒక దశ దిశ తీసుకువస్తాడు అని హ్యూస్ అన్నాడు. భారత కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ సార్థకతను ప్రసాదిస్తాడని అన్నాడు.

Kim Hughes rates Virat Kohli above MS Dhoni on captaincy

ఈ సమయంలో కోహ్లీ చేస్తున్న బ్యాటింగ్ తీరు, టెస్టు మ్యాచుల్లోనే కాకుండా ప్రపంచ కప్ పోటీల్లో కూడా వికెట్ల మధ్య పరుగు తీస్తున్న వైనం తన దృష్టిని ఆకర్షించినట్లు తెలిపాడు. ఇంతకు ముందు పర్యటించిన జట్లలో కన్నా ప్రస్తుత భారత జట్టు మెరుగ్గా కనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు.

బారత్ బౌన్స్ అయ్యే పిచ్‌లో ఆడలేకపోవడం విచిత్రంగా కనిపిస్తుందని, 2011 -12లో పెర్త్‌లో జరిగన టెస్టు మ్యాచులో కోహ్లీ బాగా ఆడాడని ఆయన అన్నాడు. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్సీని వదులుకునే సమయంలో తీవ్ర ఉద్వేగానికి గురై చిన్నపిల్లాడిలా ఏడ్చిన వైనాన్ని గుర్తు చేసుకుంటూ - తాను ఉద్వేగభరితమైన వ్యక్తినని, ఆ రోజు జరిగిన విషయాలకు తాను విచారించడం లేదని హ్యూస్ అన్నాడు. నువ్వు బాగా ప్రేమించే విషయాన్ని వదులుకోవాల్సి వచ్చినప్పుడు ఉద్వేగానికి గరి కావడం సహజమని అన్నాడు.

ధోనీ తన లాగా ఏడ్చి ఉండడని, ఎందుకుంటే ధోనీ తీవ్రమైన ఒత్తిడిలో కూడా చాలా అరుదుగా ఉద్వేగానికి గురవుతాడని అన్నాడు. ధోనీ సూపర్ స్టార్ అని, తాను రెండు పూర్తి సీజన్లలో పొందినదాన్ని ధోనీ ఒక్క రోజులోనే పొందుతాడని అన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+