ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ముంబయి ఇండియన్స్‌కు చెందిన ఎంఐ ఎమిరేట్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గల్ఫ్ జెయింట్స్‌తో జరిగిన క్వాలిఫయిర్-1 మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించింది.ఇవాళ దుబాయ్ క్యాపిటల్స్ - గల్ఫ్ జెయింట్స్ మధ్య జరిగే క్వాలిఫయిర్-2లో విజేతతో టైటిల్ పోరులో ముంబయి తలపడుతుంది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 163 పరుగులు చేసింది. ఓపెనర్లు మహమ్మద్ వసీమ్ (12; 10 బంతుల్లో), కుశాల్ పెరెరా (22; 17 బంతుల్లో) దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే స్వల్యవ్యవధిలోనే ముంబయి రెండు వికెట్లు కోల్పోయింది. వరుస బంతుల్లో వసీన్, వన్‌డౌన్‌లో వచ్చిన ఫ్లెచర్ (0) ఔటయ్యారు. కాసేపటికే మరో ఓపెనర్ పెరెరా కూడా వెనుదిరిగాడు.

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ నికోలస్ పూరన్ (36; 28 బంతుల్లో), డ్వేన్ బ్రావో (30; 28 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దారు. మంచి బంతుల్ని గౌరవిస్తూ పరుగులు సాధించారు. వారిద్దరు ఔటైన అనంతరం ముంబయి స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. టిమ్ డేవిడ్ (29; 21 బంతుల్లో)తో కలిసి పొలార్డ్ (27; 14 బంతుల్లో) విధ్వంసం సృష్టించాడు. పొలార్డ్ మూడు బౌండరీలు, ఒక సిక్సర్ బాదాడు. గల్ఫ్ జెయింట్స్ బౌలర్లలో డేనియల్ వోరాల్ మూడు వికెట్లతో సత్తాచాటాడు.
అనంతరం ఛేదనకు వచ్చిన గల్ఫ్ జెయింట్స్ 18.2 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. క్రిస్ జోర్డాన్ (31; 15 బంతుల్లో) టాప్ స్కోరర్. ముంబయి ఎమిరేట్స్ బౌలర్ల ధాటికి గల్ఫ్ జట్టులో నలుగురే రెండంకెల స్కోరును అందుకున్నారు. క్రిస్ లిన్ (18; 19 బంతుల్లో), ఉస్మాన్ ఖాన్ (26; 28 బంతుల్లో), జేమీ స్మిత్ (10; 11 బంతుల్లో) పరుగులు చేశారు. ఎంఐ బౌలర్లలో విజయ్‌కాంత్ మూడు వికెట్లు, అకియల్ హోస్సేన్, వాకర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అయితే ఈ మ్యాచ్‌లో అంబటి రాయుడుకు ఎంఐ ఎమిరేట్స్ అవకాశం ఇవ్వలేదు. గత మ్యాచ్‌ల్లో రాయుడు ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. కానీ రాయుడు అంచనాలను అందుకోలేదు.