పాక్‌తో మ్యాచ్: పొలార్డ్ మరో అద్భుత క్యాచ్ (వీడియో)
షార్జా: వెస్టిండీస్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ మరో అద్భుత క్యాచ్ పట్టాడు. షార్జాలో పాకిస్తాన్ - వెస్టిండీస్ మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పొలార్డ్ మరో క్లాసిక్ క్యాచ్ అందుకున్నాడు. మరోసారి అందరిని తన వైపుకు తిప్పుకున్నాడు.
పొలార్డ్ బౌండర లైన్ వద్ద అందుకున్న ఓ మెరుపు క్యాచ్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. వెస్టిండీస్ బౌలర్ కార్లోస్ బ్రాత్‌వైట్ విసిరిన బంతిని పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్ మిడ్ వికెట్ దిశగా సిక్స్ కొట్టే ప్రయత్నం చేశాడు. బంతి దాదాపు బౌండరీ లైన్ ఆవల పడుతున్న దశలో లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న పొలార్డ్ మెరుపు వేగంతో పరుగెత్తుకొచ్చి ఒంటిచేత్తో క్యాచ్‌గా అందుకున్నాడు.
అయితే ఈ క్రమంలో పరుగు వేగాన్ని నియంత్రించుకోలేక పొలార్డ్ బౌండరీ లైన్ దాటాల్సి రావడంతో వెంటనే బంతిని గాల్లోనే మైదానంలోకి విసిరేశాడు. అనంతరం బౌండరీ లైన్ వెలుపల నుంచి మళ్లీ తిరిగొచ్చి క్యాచ్ అందుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో పాక్ చేతిలో 111 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఓడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications