నోటికి ప్లాస్టర్: పొలార్డ్‌ను సమర్ధించిన హార్భజన్ సింగ్
బెంగుళూరు: ఐపీఎల్ 8లో భాగంగా ఆదివారం బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ Vs ముంబై ఇండియన్స్‌కు మధ్య బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాడు కీరన్ పొలార్డ్ నోటికి ప్లాస్టర్ వేసుకని వినూత్న శైలిలో నిరసన తెలియజేయడాన్ని హర్భజన్ సింగ్ సమర్ధించాడు.
'అతనిని అంపైర్ కామ్‌గా ఉండమని చెప్పాడు. ఆ క్రమంలోనే అతను నోటికి ప్లాస్టర్ వేసుకున్నాడు. ఇందులో తప్పేముంది. అలా చేయడం అతనికిష్టం' అని హర్భజన్ స్పష్టం చేశాడు. "హై ఓల్డేజ్ టోర్నమెంట్ అయిన ఐపీఎల్‌లో ఏదోక ప్రత్యేకతతో పొలార్డ్ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాడు. వెస్టిండీస్ ఆటగాళ్లు భిన్నంగా కనిపిస్తూ ఉండటం నిజంగా మంచి అలవాటు" అంటూ భజ్జీ అభివర్ణించాడు.

209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై బౌలర్ లసిత్ మలింగ వేసిన తొలి ఓవర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఓపెనర్ క్రిస్ గేల్ మెయిడెన్‌గా ఆడాడు, ఈ క్రమంలో మూడో ఓవర్ ఆరంభంలో తన దేశానికి చెందిన క్రిస్ గేల్ దగ్గరికి వెళ్లి పొలార్డ్ నోరు పారేసుకున్నాడు.
పొలార్డ్ చర్యలను గమనించిన ఆన్‌ఫీల్డ్ అంఫైర్లు పొలార్డ్‌ను కామ్‌గా ఉండమని చెప్పాడు. దీంతో కోపానికి గురైన కీరన్ పొలార్డ్ డగౌట్‌కు వెళ్లి నోటికి ప్లాస్టర్ వేసుకొని వచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications