For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వయసుదేముంది బ్రో.. ఇలాంటి క్యాచులు పట్టేస్తుంటే?.. పొలార్డ్‌ స్టన్నింగ్ క్యాచ్!

 Kieron Pollard pollard takes a stunner to send Shoaib Malik back

తాజాగా ఐపీఎల్‌లో రిటైర్‌మెంట్ ప్రకటించిన కరీబియన్ వీరుడు కీరన్ పొలార్డ్ తనలో ఇంకా సత్తా ఉందని నిరూపిస్తున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్‌ తరఫున ఆడుతున్న అతను తాజాగా జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. కరాచీ కింగ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో పొలార్డ్ అందుకున్న క్యాచ్ ఈ మ్యాచ్‌ను మలుపు తిప్పిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముల్తాన్ భారీ స్కోరు చేసింది.

ఛేజింగ్‌లో కరాచీ కింగ్స్ కూడా ధాటిగానే ఆడారు. ఇలాంటి సమయంలో వెటరన్ బ్యాటర్ షోయబ్ మాలిక్ బ్యాటు ఝుళిపించేందుకు ప్రయత్నించాడు. అప్పటి వరకు నిదానంగా ఆడుతూ క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నించిన అతను.. భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బౌలర్ వేసిన స్లో బంతిని సరిగా అంచనా వేయలేకపోయాడు. దీంతో బంతిని సరిగా కనెక్ట్ చేయలేకపోయాడు. గాల్లోకి లేచిన బంతి లాంగాన్‌ వైపుగా వెళ్లింది. అక్కడ కీరన్ పొలార్డ్ ఫీల్డింగ్ చేస్తున్నాడు.

అయితే సరిగా కనెక్ట్ కాని బంతి.. పొలార్డ్‌కు చాలా ముందే నేలపై పడిపోయేలా కనిపించింది. కానీ వేగంగా కదిలిన పొలార్డ్.. ముందుకు దూకి మరీ డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో షోయబ్ మాలిక్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ క్యాచ్ చూసిన ప్రేక్షకులు, కరాచీ కింగ్స్ డగౌట్ ఆశ్చర్యానందంలో మునిగిపోయింది. అందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ పొలార్డ్‌ను మెచ్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో కరాచీ కింగ్స్ జట్టు మ్యాచ్‌ను తమవైపు తిప్పుకోలేకపోయింది. మూడు పరుగుల తేడాతో ఈ మ్యాచ్ ఓడింది. పొలార్డ్ క్యాచ్ చూసిన వాళ్లంతా.. ఇలాంటి క్యాచులు పడుతుంటే ఇక వయసుదేముంది బ్రో? అంటూ నెట్టింట ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.

Story first published: Thursday, February 23, 2023, 16:55 [IST]
Other articles published on Feb 23, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+