న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెస్టిండీస్ వన్డే, టీ20 కెప్టెన్‌గా కీర‌న్ పొలార్డ్!!

Kieron Pollard likely to take over West Indies captaincy in limited-overs cricket

హైదరాబాద్: స్టార్ ఆల్ రౌండర్ కీర‌న్ పొలార్డ్‌ వెస్టిండీస్ వన్డే, టీ20 పగ్గాలు అందుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం వన్డేలో జాసన్ హోల్డర్, టీ20ల్లో కార్లోస్ బ్రాత్‌వైట్‌ కెప్టెన్‌లుగా ఉన్నారు. ప్రపంచకప్‌-2019లో విండీస్ పూర్తిగా నిరాశపరిచింది. మొత్తం 10 జట్లు మెగా టోర్నీలో పాల్గొనగా.. 9వ స్థానంలో నిలిచింది. అనంతరం టీమిండియాతో జరిగిన వన్డే, టీ20, టెస్ట్ సిరీస్‌లలో వైట్‌వాష్‌కు గురైంది. దీంతో హోల్డర్, బ్రాత్‌వైట్‌లపై వేటు వేయాలనే ఆలోచనలో క్రికెట్ వెస్టిండీస్ ఉందట.

<strong>భారత్‌తో రెండో టెస్టు.. బ్రాత్‌వైట్‌ బౌలింగ్‌పై ఫిర్యాదు</strong>భారత్‌తో రెండో టెస్టు.. బ్రాత్‌వైట్‌ బౌలింగ్‌పై ఫిర్యాదు

కెప్టెన్‌గా పొలార్డ్‌కు మద్దతు:

కెప్టెన్‌గా పొలార్డ్‌కు మద్దతు:

పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో రెండు రోజుల రెగ్యులర్ త్రైమాసిక సమావేశం జరిగింది. మొదటి రోజైన శనివారం క్రికెట్ వెస్టిండీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వెస్టిండీస్ వన్డే, టీ20 కెప్టెన్‌గా పొలార్డ్‌ను నియమించాలనే నిర్ణయం తీసుకున్నారని సమాచారం తెలుస్తోంది. ఎంపిక కమిటీ కెప్టెన్‌గా కీర‌న్ పొలార్డ్‌కు ఓటేసిందట. పొలార్డ్‌కు కమిటీలోని ఆరుగురు డైరెక్టర్ల మద్దతు లభించగా.. మిగతా ఆరుగురు వ్యతిరేకంగా ఉన్నారని ఒక నివేదిక తెలిపింది.

2016లో చివరి వన్డే:

2016లో చివరి వన్డే:

32 ఏళ్ల పొలార్డ్‌ విండీస్ తరపున చివరిసారిగా 2016లో వన్డే ఆడాడు. 2019 ప్రపంచకప్‌లో పొలార్డ్‌కు చోటు దక్కకపోయినా.. స్టాండ్‌ బై ఆటగాడిగా ఎంపికయ్యాడు. అయితే స్టాండ్‌ బై ఎంపికయినా.. ఇంగ్లాండ్ వెళ్ళలేదు. టీమిండియాతో ఇటీవలే ముగిసిన టీ20 సిరీస్‌లో పాల్గొన్నాడు. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుని పర్వాలేదనిపించాడు.

విజయాల బాట పట్టేనా:

విజయాల బాట పట్టేనా:

ఈ భారీ హిట్టింగ్ ఆల్ రౌండర్ ఇప్పటివరకు 101 వన్డేలు ఆడాడు. 25.71 సగటుతో 2,289 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, తొమ్మిది అర్ధ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు ఈ ఫార్మాట్‌లో 50 వికెట్లు కూడా పడగొట్టాడు. పొలార్డ్‌ 62 టీ20 మ్యాచ్‌లలో 21.50 సగటుతో 903 పరుగులు చేసి, 23 వికెట్లు పడగొట్టాడు. మరి కొత్త కెప్టెన్‌ సారథ్యంలోనైనా విండీస్ విజయాల బాట పడుతుందేమో చూడాలి.

Story first published: Monday, September 9, 2019, 13:20 [IST]
Other articles published on Sep 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X