Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అచ్చం అక్తర్‌లానే పొలార్డ్‌.. నో బాల్‌ను డెడ్‌ బాల్‌గా మార్చాడు (వీడియో)!!

Kieron Pollard Converts No Ball Into De@d Ball, Like Shoaib Akhtar || Oneindia Telugu
Kieron Pollard converts no-ball into dead ball in Lucknow like Shoaib Akhtar

లక్నో: క్రికెట్‌ ఆటలో బౌలర్లు నో బాల్స్‌ వేయడం సహజమే. ముఖ్యంగా పేస్ బౌలర్లు ఓవర్‌ స్టెపింగ్‌ కారణంగా నో బాల్స్‌ ఎక్కువగా వేస్తుంటారు. అయితే ఓవర్‌ స్టెపింగ్‌ బాల్స్‌ను డెడ్‌ బాల్స్‌గా మార్చడంలో పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్‌ అక్తర్‌ ఎక్స్‌పర్ట్‌. అక్తర్‌ పరుగెత్తుకుంటూ వచ్చి బాల్‌ను వేయబోయే క్రమంలో ఓవర్‌ స్టెపింగ్‌ అవవడంతో.. బంతిని పట్టుకుని అలానే ముందుకు వెళ్లిపోయేవాడు. దీంతో నో బాల్‌ కాస్త డెడ్‌ బాల్‌గా మారేది.

అచ్చం అక్తర్‌లానే:

అచ్చం అక్తర్‌లానే:

తాజాగా వెస్టిండీస్‌ కెప్టెన్‌ కీరోన్‌ పొలార్డ్‌ కూడా అచ్చం అక్తర్‌లానే చేసాడు. సోమవారం అఫ్గానిస్తాన్‌తో వెస్టిండీస్‌ మూడో వన్డేలో తలపడింది. అఫ్గాన్ ఆటగాళ్లు అస్గర్‌ అఫ్గాన్‌, నజిబుల్లా జద్రాన్‌ క్రీజులో ఉన్నారు. 25వ ఓవర్ పొలార్డ్‌ వేస్తున్నాడు. బౌలింగ్ చేయడానికి పరుగెత్తుకుంటూ వచ్చిన పొలార్డ్‌.. బాల్‌ను వేయబోయే క్రమంలో ఓవర్‌స్టెపింగ్‌ అయ్యాడు. ఇది గమనించిన అంపైర్‌ 'నో బాల్‌' అంటూ అరిచాడు. పొలార్డ్‌ బంతిని వేయకుండా అలానే ముందుకు వెళ్లిపోయాడు. దీంతో అంపైర్‌ డెడ్‌ బాల్‌గా ప్రకటించాడు.

అక్తర్‌ ఎక్స్‌పర్ట్‌:

అక్తర్‌ ఎక్స్‌పర్ట్‌:

ఈ తరహా ఘటనలో క్రికెట్‌లో తరచూ జరుగుతూనే ఉంటాయి. అయితే నో బాల్‌ను డెడ్‌ బాల్‌గామార్చడంలో మాత్రం అక్తర్‌ ఎక్స్‌పర్ట్‌. అక్తర్‌ తన హయాంలో ఎక్కువగా ఇలానే చేసేవాడు. ఇప్పుడు ఎక్స్‌పర్ట్‌ అక్తర్‌నే పొలార్డ్‌ మించిపోయాడు. ప్రస్తుతం ఓవర్‌ స్టెపింగ్‌కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మీరు కూడా ఓసారి చూసి నవ్వుకోండి.

సిరీస్ క్లీన్‌స్వీప్:

సిరీస్ క్లీన్‌స్వీప్:

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన చివరి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విండీస్ విజయం సాధించింది. 250 పరుగుల లక్ష్యఛేదనలో విండీస్ 48.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. షాయ్ హోప్ (145 బంతుల్లో 109 నాటౌట్) సెంచరీ చేయగా.. రొస్టన్ చేజ్ (42నాటౌట్), బ్రెండన్ కింగ్ (39) రాణించారు. అంతకు ముందు అస్గర్ ఆఫ్ఘన్ (86), హజ్రతుల్లా జజాయ్ (50), మహమ్మద్ నబీ (50నాటౌట్) అర్ధ శతకాలతో రాణించడంతో ఆఫ్ఘన్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేయగలిగింది. హోప్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్', చేజ్‌కు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డులు దక్కాయి.

బ్రేవో సంచలన వ్యాఖ్యలు:

తాజాగా వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో సంచలన వ్యాఖ్యలు చేసాడు. తన కెరీర్‌ అర్థాంతరంగా ముగిసిపోవడానికి కారణం వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు మాజీ అధ్యక్షుడు డేవ్‌ కామెరూన్‌ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. తనతో పాటు చాలామంది క్రికెట్ కెరీర్‌ను నాశనం చేశాడు అని బ్రేవో అన్నాడు. డేవ్‌ కామెరూన్‌ ఆరేళ్ల పాలన ముగియడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. కామెరూన్‌ పదవీ కాలం ముగియడంతో ఈ ఏడాది మార్చిలో వెస్టిండీస్ మాజీ జట్టు మేనేజర్ రికీ స్కిరిట్‌ క్రికెట్ వెస్టిండీస్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.

Story first published: Tuesday, November 12, 2019, 18:08 [IST]
Other articles published on Nov 12, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+