Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అసలేం జరిగింది?: వెస్టిండిస్‌లో పాండ్యాను అరెస్ట్ చేయించబోయిన పొలార్డ్

Kieron Pollard called police to have Hardik Pandya arrested in West Indies, here’s why

హైదరాబాద్: గతంలో వెస్టిండిస్ పర్యటనకు వెళ్లినప్పుడు తనను కీరన్ పొలార్డ్‌ అరెస్ట్‌ చేయించబోయాడని టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తాజాగా వెల్లడించాడు. 'బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్' అనే కార్యక్రమంలో పాల్గొన్న పాండ్యా ఈ విషయాన్ని వెల్లడించాడు.

వీరిద్దరూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతనిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అంతేకాదు పొలార్డ్‌ని పాండ్యా ఓ సొంత బ్రదర్‌లాగా చూసుకుంటాడు. ఇదే విషయాన్ని గతంలో అనేకసార్లు పాండ్యా చెప్పడాన్ని మనం చూశాం.

తాజాగా గౌరవ్ కపూర్ హోస్ట్‌గా వ్వవహరిస్తోన్న 'బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్' అనే వెబ్ సిరిస్‌లో పాండ్యా పాల్గొన్నాడు. ఇందులో భాగంగా పాండ్యా మాట్లాడుతూ 'పొలార్డ్‌తో కలిసి వెళుతున్నా. అనుకోకుండా ఓ పోలీస్‌ ఆఫీసర్‌ నిన్ను అరెస్ట్‌ చేస్తున్నామన్నాడు. దాంతో కాసేపు షాకయ్యా. కాకపోతే ఏమి కాదనే ధైర్యంతో కామ్‌గా ఉన్నా. నేను ఏమీ తప్పుచేయలేనప్పుడు అరెస్ట్‌ చేయడమే ఆలోచనలో పడ్డా' అని చెప్పుకొచ్చాడు.

'భారత జట్టు యాజమాన్యానికి ఫోన్‌ చెద్దామని అనుకున్నా. అప్పుడు పొలార్డ్‌ కూడా అలాగే చూస్తుండిపోయాడు. అదే క్రమంలో ఏమిటి సైలెంట్‌గా ఉన్నావ్‌ అంటూ పొలార్డ్‌ నుంచి ఒక ప్రశ్న ఎదురైంది. నీ సిటీలో నీ పక్కన ఉన్నప్పుడు ఏమి జరగదనే నమ్మకం నాకుందన్నా. కాకపోతే ఆ ఇద్దరూ కలిసి నన్ను భయపెట్టే యత్నం చేస్తున్నారని తరువాత కానీ అర్థం కాలేదు' అని పొలార్డ్‌తో గత జ్ఞాపకాన్ని పాండ్యా గుర్తు చేసుకున్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 2, 2017, 16:05 [IST]
Other articles published on Dec 2, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+