పొలార్డ్‌ అరుదైన ఘనత.. 500 టీ20లు ఆడిన తొలి క్రికెటర్‌గా రికార్డు!!

Kieron Pollard becomes first cricketer to play 500 T20s

పల్లెకెల: వెస్టిండీస్ కెప్టెన్ కీరన్‌ పొలార్డ్‌ అరుదైన ఘనత అందుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో 500 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. పల్లెకెల వేదికగా బుధవారం శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌తో పొలార్డ్ ఈ ఘనత అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అన్ని లీగ్‌ల్లో కలుపుకొని వెస్టిండీస్ కెప్టెన్ 500 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లు.. వర్షం పడితే ఏ జట్లకు లాభం?!!

తొలి క్రికెటర్‌గా రికార్డు:

టీ20 ఫార్మాట్‌లో 500 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా కీరన్‌ పొలార్డ్‌ నిలవగా.. రెండో స్థానంలో విండీస్ ఆల్‌రౌండర్‌ డ్వేన్ బ్రావో ఉన్నాడు. బ్రావో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అన్ని లీగ్‌ల్లో కలుపుకొని 453 మ్యాచ్‌లు ఆడాడు. విండీస్ ఓపెనర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 404 టీ20 మ్యాచ్‌లు ఆడి ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు. తొలి మూడు స్థానాల్లో విండీస్ ఆటగాళ్లు ఉండడం ఇక్కడ విశేషం.

17 వేర్వేరు టీ20 జట్లకు ప్రాతినిధ్యం:

17 వేర్వేరు టీ20 జట్లకు ప్రాతినిధ్యం:

కీరన్‌ పొలార్డ్‌ తన జాతీయ జట్టు వెస్టిండీస్‌తో సహా 17 వేర్వేరు టీ20 జట్లకు ఆడాడు. టీ20 ప్రపంచకప్‌తో సహా 13 టైటిళ్లు పొలార్డ్‌ గెలుచుకున్నాడు. విండీస్ ఆల్‌రౌండర్‌ పొలార్డ్‌ 2010 నుండి ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్ జట్టు తరఫునే ఆడుతున్నాడు. ఇప్పటివరకు ముంబై తరఫున 170 మ్యాచ్‌లలో పాల్గొన్నాడు. నాలుగు ఐపీఎల్ టైటిల్స్, రెండు ఛాంపియన్స్ లీగ్ టీ20లను ముంబై గెలవడంతో తనవంతు కృషి చేసాడు.

34 రన్స్ దూరంలో పొలార్డ్:

34 రన్స్ దూరంలో పొలార్డ్:

ఐపీఎల్ 2020 కోసం ముంబై ఇండియన్స్ ప్రణాళికల్లో కీరన్‌ పొలార్డ్ కీలకం కానున్నాడు. బ్యాట్, బంతితో పొలార్డ్ మెరిస్తే.. ముంబై సునాయాస విజయాలను అందుకుంటుంది. పొలార్డ్ టీ20 క్రికెట్‌లో 10,000 పరుగులు చేయడానికి 34 రన్స్ దూరంలో నిలిచాడు. క్రిస్ గేల్ ఇప్పటికే పది వేల మార్క్ అందుకున్నాడు. త్వరలో పొలార్డ్ కూడా ఆ రికార్డు అందుకోనున్నాడు.

తొలి టీ20లో వెస్టిండీస్‌ విజయం:

తొలి టీ20లో వెస్టిండీస్‌ విజయం:

బ్యాటింగ్‌లో టాపార్డర్‌ దుమ్మురేపడంతో పాటు బౌలింగ్‌ ఒషానో థామస్‌ (5/28) చెలరేగడంతో శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్‌ విజయం సాధించింది. మొదట విండీస్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 196 పరుగులు చేసింది. సిమన్స్‌ (67 నాటౌట్‌) హాఫ్ సెంచరీ చేయగా.. బ్రండన్‌ కింగ్‌ (33), రస్సెల్‌ (35; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), పొలార్డ్‌ (34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో లంక 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. కుషాల్‌ పెరేరా (66), హసరంగ (44) పోరాడినా ఫలితం లేకపోయింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, March 5, 2020, 9:59 [IST]
Other articles published on Mar 5, 2020
POLLS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more