తొలి క్రికెటర్‌గా రికార్డు:
టీ20 ఫార్మాట్‌లో 500 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా కీరన్ పొలార్డ్ నిలవగా.. రెండో స్థానంలో విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఉన్నాడు. బ్రావో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అన్ని లీగ్‌ల్లో కలుపుకొని 453 మ్యాచ్‌లు ఆడాడు. విండీస్ ఓపెనర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 404 టీ20 మ్యాచ్‌లు ఆడి ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు. తొలి మూడు స్థానాల్లో విండీస్ ఆటగాళ్లు ఉండడం ఇక్కడ విశేషం.

17 వేర్వేరు టీ20 జట్లకు ప్రాతినిధ్యం:
కీరన్ పొలార్డ్ తన జాతీయ జట్టు వెస్టిండీస్‌తో సహా 17 వేర్వేరు టీ20 జట్లకు ఆడాడు. టీ20 ప్రపంచకప్‌తో సహా 13 టైటిళ్లు పొలార్డ్ గెలుచుకున్నాడు. విండీస్ ఆల్‌రౌండర్ పొలార్డ్ 2010 నుండి ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్ జట్టు తరఫునే ఆడుతున్నాడు. ఇప్పటివరకు ముంబై తరఫున 170 మ్యాచ్‌లలో పాల్గొన్నాడు. నాలుగు ఐపీఎల్ టైటిల్స్, రెండు ఛాంపియన్స్ లీగ్ టీ20లను ముంబై గెలవడంతో తనవంతు కృషి చేసాడు.

34 రన్స్ దూరంలో పొలార్డ్:
ఐపీఎల్ 2020 కోసం ముంబై ఇండియన్స్ ప్రణాళికల్లో కీరన్ పొలార్డ్ కీలకం కానున్నాడు. బ్యాట్, బంతితో పొలార్డ్ మెరిస్తే.. ముంబై సునాయాస విజయాలను అందుకుంటుంది. పొలార్డ్ టీ20 క్రికెట్‌లో 10,000 పరుగులు చేయడానికి 34 రన్స్ దూరంలో నిలిచాడు. క్రిస్ గేల్ ఇప్పటికే పది వేల మార్క్ అందుకున్నాడు. త్వరలో పొలార్డ్ కూడా ఆ రికార్డు అందుకోనున్నాడు.

తొలి టీ20లో వెస్టిండీస్ విజయం:
బ్యాటింగ్‌లో టాపార్డర్ దుమ్మురేపడంతో పాటు బౌలింగ్ ఒషానో థామస్ (5/28) చెలరేగడంతో శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్ విజయం సాధించింది. మొదట విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 196 పరుగులు చేసింది. సిమన్స్ (67 నాటౌట్) హాఫ్ సెంచరీ చేయగా.. బ్రండన్ కింగ్ (33), రస్సెల్ (35; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), పొలార్డ్ (34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో లంక 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. కుషాల్ పెరేరా (66), హసరంగ (44) పోరాడినా ఫలితం లేకపోయింది.


Click it and Unblock the Notifications












