
హైదరాబాద్: వెస్టిండీస్ ఆటగాడు కీరన్ పొలార్డ్ రికార్డు పేరిట కొత్త రికార్డు నమోదైంది. ఇప్పటి వరకు ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని ఘనతను అందుకున్నాడు. అత్యధికంగా 400 టీ20లు ఆడిన వాడిగా నిలిచిపోయాడు. పొలార్డ్ ఇప్పటివరకు 400కు పైగా టీ20 ఆడాడు. ఏ ఆటగాడు ఇన్ని టీ20లు ఆడిన దాఖలాలు లేవు. పొలార్డ్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.
ఆసీస్‌లో జరుగుతోన్న బిగ్ బాష్‌లీగ్‌లో పొలార్డ్ మెల్‌బోర్న్ రెనిగేడ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. టోర్నీలో భాగంగా బుధవారం సిడ్నీ థండర్స్‌తో పొలార్డ్ ఆడిన మ్యాచ్ తన కెరీర్లో 401వ టీ20 మ్యాచ్ కావడం విశేషం. అంతకుముందు సోమవారం ఆడిలైట్ స్టైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌తో పొలార్డ్ 400 మైలురాయిని అందుకున్నాడు.
అత్యధిక టీ20లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో బ్రావో(372), క్రిస్ గేల్(323) ఉన్నారు. 400 టీ20లు ఆడిన పొలార్డ్ 7,830 పరుగులు సాధించాడు. ఇందులో 39 అర్ధశతకాలు ఉన్నాయి. అటు బౌలర్‌గా 243 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
ముంబై ఇండియన్స్, బార్బడోస్ ట్రిడెంట్స్ అండ్ ట్రినిడాడ్ టొబాగో, కేప్ కోబ్రాస్, ఢాకా డైనమైట్స్, ఢాకా గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్, సోమర్‌సెట్ అండ్ సౌత్ ఆస్ట్రేలియా తదితర జట్ల తరఫున పొలార్డ్ టీ20లు ఆడుతున్నాడు. ఈ శని, ఆది వారాల్లో ఐపీఎల్ కోసం నిర్వహించే వేలంలో పొలార్డ్ తిరిగి ముంబైకే ఆడతాడో? లేక మరో జట్టులోకి వెళ్తాడో చూడాలి.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.