Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పుట్టినరోజు నాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ వింత కోరిక

Kevin Pietersen Turns 39 And Heres His Birthday Wish: England At Least Qualify For Semi-Final of ICC Cricket World Cup 2019

హైదరాబాద్: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ గురువారం 39వ పుట్టినరోజుని జరుపుకున్నాడు. పుట్టినరోజు రోజు నాడు ఇంగ్లాండ్ జట్టు నుంచి తనకొక ఓ స్పెషల్ గిఫ్ట్ కావాలని కెవిన్ పీటర్సన్ ట్విట్టర్‌లో కోరాడు. "ఈరోజు నా పుట్టినరోజు. ఈ ఏడాది నాకున్న కోరిక ఏంటంటే ఇంగ్లాండ్ జట్టు సెమీస్‌కు క్వాలిఫై కావాలని కోరుకుంటున్నా" అంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లాండ్ నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి.. మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. దీంతో సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. టోర్నీలో భాగంగా ఇంగ్లాండ్ తన తదుపరి మ్యాచ్‌ల్లో ఇండియా, న్యూజిలాండ్ జట్లతో తలపడాల్సి ఉంది.

ఇంగ్లాండ్ జట్టు తన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించాల్సి ఉంది. దీంతో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్ తదుపరి మ్యాచ్ విజయావకాశాలపై కూడా ఇంగ్లాండ్ సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

Story first published: Thursday, June 27, 2019, 15:38 [IST]
Other articles published on Jun 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+