హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని లక్ష్యంగా చేసుకుని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాలోని లాగ్ వెగాస్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఓ సంగీత కచేరీలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 58 మంది చనిపోగా, సుమారు 515 మంది గాయపడిన సంగతి తెలిసిందే.
ఈ కాల్పుల ఘటన అనంతరం డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడాడు. 'ఈ కాల్పుల ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకి సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నా భార్యతో కలిసి ప్రార్థిస్తున్నా' అని అన్నాడు. ట్రంప్ వ్యాఖ్యలపై పీటర్సన్ ట్విటర్ వేదికగా స్పందించాడు.

'ట్రంప్ స్పీచ్ ఇప్పుడే చూశాను. భలే ముగించాడు. తెలివి తక్కువ అమెరికా! తెలివి తక్కువ ప్రపంచమా!' అని ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో పీటర్సన్‌పై మండిపడ్డారు. ఇలాంటి ట్వీట్స్ వల్ల నీకు చాలా డబ్బులు వస్తాయి కదా? అంటూ పీటర్సన్‌కు చురకలంటించారు.
ఇంగ్లాండ్ తరఫున 104 టెస్టులు, 136 వన్డేలు, 37 టీ20 మ్యాచ్‌లు ఆడిన కెవిన్ పీటర్సన్ జట్టుకు సంబంధించిన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేస్తున్నాడనే అభియోగాలతో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు జట్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.