ఆగస్టు 2012లో దక్షిణాఫ్రికా జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించింది. ఇరు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరిగింది. హెడింగ్లీ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తరఫున కెవిన్ పీటర్సన్ అద్భుతంగా ఆడి 149 పరుగులు చేశాడు. కానీ అతడిని తదుపరి మ్యాచ్‌కు తప్పించారు. ఏ బ్యాటర్ అయినా సెంచరీ చేసిన తర్వాత అతనికి గాయం లేదా ఆడించలేని మరేదైనా కారణం లేనంతవరకు తదుపరి మ్యాచ్‌లో ఆడే అవకాశం దక్కకపోవడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ఇక్కడ విషయం వేరే ఉంది.
నిజానికి కెవిన్ పీటర్సన్‌ను అతని ఓ టెక్ట్స్ మెసేజ్ కారణంగా ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తొలగించాల్సి వచ్చింది. ఈ ఒక టెక్ట్స్ మెసేజ్ పీటర్సన్ కెరీర్ నాశనానికి కారణమైంది. ఇంతే కాకుండా పీటర్సన్‌పై తన జట్టుకు ద్రోహం చేశాడనే ఆరోపణ కూడా వచ్చింది. దీని తర్వాత పీటర్సన్ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు క్షమాపణలు కూడా చెప్పాడు. కానీ ఆ తర్వాత ఈ దిగ్గజ ఆటగాడి కెరీర్ దెబ్బతింది.

టెక్స్ట్ గేట్ వివాదం ఏంటి?
నిజానికి ఈ మొత్తం వివాదం ఇంగ్లాండ్ జట్టులోని అంతర్గత కలహాల వచ్చే వచ్చింది. ఆ సమయంలో కెవిన్ పీటర్సన్, ఇంగ్లాండ్ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ మధ్య చాలా విభేధాలు ఉన్నాయి. కెవిన్ పీటర్సన్.. ఆండ్రూ స్ట్రాస్, కోచ్ ఆండీ ఫ్లవర్ గురించి అభ్యంతరకరమైన మెసేజ్‌లను దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు పంపినప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. పీటర్సన్ స్ట్రాస్ కోసం ఓ అవమానకరమై ఆఫ్రికన్ పదం 'డూజ్'ను టెక్స్ట్ మెసేజ్‌లో ఉపయోగించారని ఆరోపణలు వచ్చాయి. దీని అర్థం ఇడియట్ లేదా అంతకంటే దారుణంగా ఉండవచ్చు.
ఇది కేవలం అవమానకరమైన పదాన్ని ఉపయోగించడం గురించే.. కానీ కొన్ని నివేదికల్లో పీటర్సన్ తన కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్‌ను ఔట్ చేయడానికి దక్షిణాఫ్రికా బౌలర్ల సలహా ఇచ్చారని కూడా ఆరోపించబడింది. పీటర్సన్ ఇలా చేయడం ఓ రకంగా జట్టుకు ద్రోహం చేయడమే. అయితే పీటర్సన్ ఈ విషయాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. దానిని పూర్తిగా నిరాధారమని కెవిన్ పీటర్సన్ కొట్టిపారేశాడు.
పీటర్సన్ కెరీర్ నాశనం
ఈ గొడవకు ముందు పీటర్సన్ హెడింగ్లీలో అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ దాని తర్వాత కెవిన్ పీటర్సన్‌ను లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ నుంచి తప్పించారు. కెవిన్ పీటర్సన్ తర్వాత క్షమాపణలు కూడా చెప్పాల్చి వచ్చింది. ఈ మొత్తం విషయం తర్వాత పీటర్సన్ కెరీర్ పతనం వైపు మళ్లింది. చివరిసారిగా పీటర్సన్ 2014లో ఇంగ్లాండ్ తరఫున టెస్ట్‌లో ఆడిన తర్వాత మళ్లీ జాతీయ జట్టు కోసం మైదానంలోకి రాలేకపోయాడు. వన్డేలు, టీ20లలో 2013 తర్వాతే పీటర్సన్ కోసం దారులు మూసుకుపోయాయి.
కెవిన్ పీటర్సన్ కెరీర్ ఇలా..
ఇంగ్లాండ్ తరఫున కెవిన్ పీటర్సన్ కెరీర్ గురించి మాట్లాడితే.. అతను 104 టెస్టులు, 136 వన్డేలు, 37 టీ20 మ్యాచ్‌లలో ఆడాడు. టెస్ట్ క్రికెట్‌లో పీటర్సన్ 47.28 సగటుతో 8181 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు, 25 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లో పీటర్సన్ పేరు మీద 40.73 సగటుతో 4440 పరుగులు ఉన్నాయి. ఈ ఫార్మాట్లో పీటర్సన్ 9 సెంచరీలు, 25 అర్థ సెంచరీలు చేశాడు. దీనితో పాటు టీ20 క్రికెట్లో పీటర్సన్ పేరు మీద 1176 పరుగులు నమోదయ్యాయి.