Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అత‌ని బౌలింగ్‌కు అంత‌లా భ‌య‌ప‌డాలా? ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ పీట‌ర్స‌న్‌

ICC Cricket World Cup 2019 : Kevin Pietersen Says Eoin Morgan Looked Scared Of Mitchell Starc
Kevin Pietersen Says Eoin Morgan Scared Of Mitchell Starc

లండ‌న్‌: భార‌త క్రికెట్ జ‌ట్టుతో మ్యాచ్ ఓడిపోయిన అనంత‌రం పాకిస్తాన్ ఎలాంటి విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్న‌దో.. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ ప‌రిస్థితి కూడా అచ్చం అలాగే త‌యారైంది. స్వదేశంలో, విదేశాల్లో విమ‌ర్శ‌ల జ‌డివాన కురుస్తోంది ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌పై. టాస్ గెలిచి, ప్ర‌త్య‌ర్థి చేతికి బ్యాటింగ్ అప్ప‌గించ‌డం అనాలోచిత‌, అవివేక‌మైన చ‌ర్య అంటూ ఇప్ప‌టికే క్రికెట్ పండితులు కేప్టెన్ ఇవాన్ మోర్గాన్‌ను టార్గెట్‌గా చేసుకుని విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు. ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్ కూడా ఈ విమ‌ర్శ‌కుల జాబితాలో చేరిపోయాడు. ఆస్ట్రేలియా బౌలింగ్ అంటే ఇంగ్లండ్ క్రికెట‌ర్లు భ‌య‌ప‌డుతున్నార‌ని అన్నాడు. ఇలా ఉంటే జ‌ట్టు సెమీఫైన‌ల్‌కు చేరుకోవ‌డం క‌ష్ట‌మ‌ని అంచ‌నా వేశాడు.

స్టార్క్ బంతుల‌కు మోర్గాన్ వ‌ద్ద స‌మాధానం లేదా?

ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ కేప్టెన్ ఇవాన్ మోర్గాన్‌.. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో ఆడ‌లేద‌ని కెవిన్ పీట‌ర్స‌న్ వ్యాఖ్యానించాడు. ప్ర‌త్యేకించి- స్టార్క్ బౌలింగ్‌ను ఎదుర్కొనడానికి మోర్గాన్ భ‌య‌ప‌డ్డాడ‌ని అన్నారు. న‌డుం ఎత్తులో మిఛెల్ స్టార్క్ సంధించిన ఓ బంతిని అద్భుత షాట్ ఆడి ఉండొచ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. స్టార్క్ బంతుల‌ను భ‌య‌ప‌డ‌టం సరికాద‌ని, ఇది జ‌ట్టుకు శుభ‌సూచ‌కం కాద‌ని చెప్పారు. దీనిపై కెవిన్‌.. వ‌రుస‌గా ట్వీట్ల‌ను సంధించారు. క్రీజులోకి వ‌చ్చిన వెంట‌నే మోర్గాన్ ఎదుర్కొన్న‌బంతిని స్టార్క్ సంధించిన‌దే. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా క‌ట్ చేసి, సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు పీట‌ర్స‌న్‌. ఈ బంతిని ఆడ‌టానికి స్క్వేర్ లెగ్ వైపు మోర్గాన్ క‌ద‌ల‌డం అత‌ని బ‌ల‌హీన‌త‌ను చూపుతోంద‌ని అన్నారు. ఓ జ‌ట్టుకు సార‌థ్యం వ‌హిస్తోన్న ఆట‌గాడికి ఇదో పెద్ద బ‌ల‌హీన‌తేన‌ని, దీని నుంచి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని తాను ఆశిస్తున్నాన‌ని చెప్పారు.

Story first published: Wednesday, June 26, 2019, 14:38 [IST]
Other articles published on Jun 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+