రీసెంట్ గా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కలిసి.. ఇంగ్లాండ్ తో జరుగుతోన్న వన్డే సిరీస్ మైదానంలో సరదాగా ముచ్చటించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విరాట్.. పీటర్సన్ ను సరదాగా ఆటపట్టించడం కూడా బాగా వైరల్ అయింది. దీంతో వీరిద్దరి మధ్య అంతలా ఏం చర్చ జరిగిందా అని తెలుసుకునేందుకు చాలా మంది ఆరాటపడ్డారు. తాజాగా ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు కెవిన్ పీటర్సన్.
ఈ మధ్య కాలంలో కోహ్లీ ఎక్కువగా తన ఫ్యామిలీ టైమ్ ను లండన్ లో గడుపుతోన్నసంగతి తెలిసిందే. విరాట్ కొడుకు కూడా అక్కడే జన్మించాడు. దీంతో కోహ్లీ లండన్ లోనే సెటిల్ అవ్వబోతున్నాడని గత కొద్దికాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయం తెలిసి విరాట్ ఫ్యాన్స్ కాస ఫీలయ్యారు కూడా. ఈ క్రమంలోనే విరాట్ అక్కడి రియల్ ఎస్టేట్ గురించి పీటర్సన్ ను అడిగి ఆరా తీస్తున్నాడని ఇప్పుడు అంతా ఊహించుకుంటున్నారు. అందుకే పీటరన్స్ తో డిస్కషన్స్ చేస్తున్నాడని అనుకున్నారు.

తాజాగా ఇదే విషయమై ఆకాశ్ చోప్రా, సురేశ్ రైనా.. కెవిన్ పీటర్సన్ ను ప్రశ్నించారు. 'కోహ్లీ ఎక్కువగా విదేశాల్లోనే గడుపుతున్నాడు. కాబట్టి అతడు.. లండన్ లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, అక్కడ మంచిగా ఉన్న ప్రదేశాలేంటి అని అడిగి తెలుసుకుంటున్నాడేమో అని అంతా అనుకుంటున్నారు.' అని చోప్రా అడగగా.. "లేనీపోని విషయాలను ఊహించుకోవద్దు.
నేను కూడా ఊహాగానాలను సృష్టించగలను. కానీ అలా చేయను" అని అన్నాడు. ఆ వెంటనే సురేశ్ రానా అందుకుని.. 'నాకు తెలిసి వీరిద్దరు గోల్ఫ్,సఫారీ ఆడటంపై చర్చించుకుని ఉంటారు' అని అన్నాడు. "హా రైనా నువ్వు ఊహించిన దాంట్లో తప్పు లేదు. కోహ్లీని గోల్ఫ్ ఆడటం ప్రారంభించమని చెప్పాను. అది చాలా గొప్ప గేమ్ కదా." అని సమాధానం చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ అనవసరంగా ఏదేదో ఊహించేసుకున్నామే అని కామెంట్లు పెడుతున్నారు.