ఐపీఎల్ కామెంట్రీకి గుడ్‌బై చెప్పిన కెవిన్ పీటర్సన్..!
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ కెవిన్ పీటర్సన్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో కామెంట్రీ కోసం వచ్చిన సంగతి తెలిసిందే. అతను ఒప్పందం మేరకు పలు మ్యాచ్‌లకు కామెంట్రీ చేశాడు. ఇక ఒప్పందం పూర్తి కావడంతో కామెంట్రీ ప్యానెల్‌కు గుడ్‌బై చెప్పాడు. కెవిన్ ఏప్రిల్ నెల మధ్యలో కామెంట్రీ బృందంలో చేరాడు. అప్పటి నుండి అతను మ్యాచ్ డిబేట్లలో పాల్గొనడం, పిచ్ రిపోర్ట్‌లు సమీక్షించడం, కామెంట్రీ చేయడం, అలాగే తన ఒపినీయన్లను ప్రస్తావించడం లాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నాడు. ఇక పీటర్సన్ మే 9న ట్విట్టర్ ద్వారా తాను ఐపీఎల్‌ను విడిచి వెళ్తున్నట్లు ట్వీట్ చేశాడు. మే 29వరకు ఐపీఎల్ జరగనున్న సంగతి తెలిసిందే. మే 29న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ టోర్నమెంట్‌లో 19మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. దాదాపు ఐపీఎల్ 2022 ముగింపు దశకు చేరుకుంటుంది.

ఇండియా ఎప్పటికీ ప్రత్యేకమే
ఇక ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసిన కెవిన్ పీటర్సన్.. 'తిరిగి ఇంటికెళ్తున్నా. ఇండియాకు మరోసారి ధన్యవాదాలు. భారతదేశం తనకు ఎప్పటికీ స్పెషల్' అని ట్వీట్లో పేర్కొన్నాడు. ప్లేయర్‌గా కెవిన్ పీటర్సన్ గతంలో ఐపీఎల్లో ఆడాడు. ఐపీఎల్లో ఐదు ఎడిషన్లలో వివిధ జట్ల తరఫున కెవిన్ పీటర్సన్ పాల్గొన్నాడు. ఐపీఎల్ 2009లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున టోర్నీలో అరంగేట్రం చేసిన కెవిన్.. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ (అప్పటి ఢిల్లీ డేర్ డెవిల్స్), రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ (RPSG) తరఫున కూడా ఆడాడు. ఐపీఎల్లో 2016 సీజన్లో అతను తన చివరి మ్యాచ్ ఆడాడు. ఇక పీటర్సన్ మొత్తం 36 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 1001పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో ఏడు వికెట్లు కూడా తీశాడు.

అంతర్జాతీయ క్రికెట్లో..
కెవిన్ పీటర్సన్ అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లాండ్ తరఫున 104టెస్టులు ఆడాడు. అలాగే 136 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 8181పరుగులు చేసిన కెవిన్, వన్డేల్లో 4440పరుగులు చేశాడు. ఇక టీ20 ఫార్మాట్లో 37మ్యాచ్‌లు ఆడిన కెవిన్ 37.94సగటుతో మొత్తం 1176పరుగులు చేశాడు. ఏడు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు.

ఐపీఎల్లో నేడు
ఐపీఎల్లో నేడు మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ (MI) 56వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ మైదానంలో జరగనుంది. ఇక ఈ రెండు జట్లూ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి. కోల్ కతా 8వ స్థానంలో ఉండగా.. ముంబై చివరగా 10వ స్థానంలో ఉంది. ఇక ముంబై గెలిచినా గెలవకున్నా పోయేదేం లేదు కానీ.. కోల్ కతా ఓడిపోతే మాత్రం ప్లేఆఫ్ రేసు నుంచి పూర్తిగా తప్పుకున్నట్లు అవుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications