సిడ్నీ: బిగ్‌బాష్ లీగ్‌లో పాల్గొనేందుకు ఆస్టేలియాకు వచ్చిన ఇంగ్లాండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌కు సిడ్నీ ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. 35 ఏళ్ల ఈ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఈ ఏడాది బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ తరుపున ఆడుతున్నాడు.

ఈ క్రమంలో క్వాంటాస్ ఎయిర్ లైన్స్‌లో సిడ్నీకి చేరుకున్న ఆయన్ను ఎయిర్ పోర్టులోని విశ్రాంతి గదిలోకి అనుమతించలేదు. దీనిపై తీవ్రంగా మండిపడ్డ పీటర్సన్, క్వాంటాస్ సంస్థ 'ముప్పెట్స్' గా అభివర్ణిస్తూ ట్వీట్ చేశాడు.
కాగా, ఆయన డ్రస్‌పై కొన్ని ప్లాస్టిక్‌ను పోలిన వస్తువులు ఉండటం వల్లే పీటర్సన్‌ను రానివ్వలేదని తెలుస్తోంది. చివరి ట్వీట్‌లో ఏది ఏమైనా ఆస్టేలియాకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ చాలా మంది స్నేహితులు ఉన్నారని, వచ్చే నెలలో వారిని కలుసుకునేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానన్నారు.